Begin typing your search above and press return to search.
ప్రముఖ 'కొరియోగ్రాఫర్'కి అస్వస్థత.. ప్రస్తుతం ఆసుపత్రిలో..
By: Tupaki Desk | 24 Jun 2020 3:30 PM GMTబాలీవుడ్ సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యారు. సరోజ్ ఖాన్ కి ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో ముంబై నగరం బాంద్రా ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో ఈ వార్త తెలిసే సరికి ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే సరోజ్ ఖాన్కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో నెగెటివ్ అని తేలింది. ఆమెకి ఈ శ్వాస సంబంధ సమస్య ఇదివరకే వచ్చిందట. కొన్నిరోజుల క్రితం అలా శ్వాసలో సమస్య వస్తే రోజుల పాటు చికిత్స తీసుకుందట.
ఇక ఈ మధ్య సరోజ్ ఖాన్ శ్వాస సమస్య తీవ్రం కావడంతో ఎన్నో అవస్థలు పడుతూ వైద్యం చేయించుకుంటుందట. అసలే ఈ ఏడాది వరుస సినీ సెలబ్రిటీల మరణాలను భరించలేకపోతున్న అభిమానులకు ఈ వార్త కాస్త కంగారు కలిగించింది. మొదటగా ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందినప్పటికీ.. కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. సరోజ్ ఖాన్ గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత 2019లో కంగనా రనౌత్ 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'లో..
మాధురి దీక్షిత్ 'కలంక్' సినిమాలలో పాటలకు కోరియోగ్రఫీ చేశారు. గతంలో మాధురి దీక్షిత్.. కాజోల్.. కరిష్మా కపూర్.. ఇలా స్టార్స్ అందరికి పాటలకు డాన్స్ కంపోజ్ చేశారు. ఆమె కొరియోగ్రాఫర్ గా అనేక సినిమాలకు హిట్లు అందించారు. అలాగే ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆమె తన కెరీర్లో దాదాపు రెండు వేలకు పైగా పాటలకు డాన్స్ కంపోజ్ చేశారట. ఏక్ దో తీన్.. డోలా రే డోలా రే.. చోలీకే పీచే క్యా హై లాంటి పాటలు ఎన్నో ఇప్పటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం సరోజ్ ఖాన్ త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థిస్తున్నారు.