Begin typing your search above and press return to search.
తెలుగు హీరోలని బాలీవుడ్ కాపీ... వర్మ భలే లాజిక్ పట్టాడే
By: Tupaki Desk | 13 Sep 2022 8:30 AM GMTటాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లు దక్కడం.. బాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ మరియు బాయ్ కాట్ బ్యాచ్ పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. బాలీవుడ్ హీరోలు అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు.. వారి యొక్క ప్రవర్తన చూస్తేనే అహం పూరితంగా ఉంటుంది అన్నట్లుగా పేర్కొన్నాడు. అలాంటి వారిని బాలీవుడ్ ప్రేక్షకులు తిరస్కరించాలని భావించి బాయ్ కాట్ నినాదం చేస్తున్నారంటూ వర్మ పేర్కొన్నాడు.
బాలీవుడ్ లో వస్తున్న వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో అక్కడి హీరోలు తమ యొక్క ఆటిట్యూడ్ ను మార్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే వారు చాలా సౌమ్యంగా ఉంటూ ప్రతి ఒక్కరి పట్ల చాలా గౌరవంగా వినమ్రంగా ఉండే తెలుగు సినిమా హీరోలను చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హిందీ హీరోలు తెలుగు హీరోల యొక్క సింపుల్ సిటీ ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.
బాలీవుడ్ లో చాలా వినమ్రంగా ఉన్న హీరోల సినిమాలు ఈమధ్య సక్సెస్ అవుతున్నాయి. అందులో భాగంగానే తెలుగు సినిమాలు అక్కడ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.
రామ్ గోపాల్ వర్మ ఇంకా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి ఆటిట్యూడ్ తోనే మంచి గుర్తింపు వచ్చింది. కానీ బాలీవుడ్ లో అది వర్కౌట్ అవ్వలేదు.
హిందీ ప్రేక్షకులు ఆటిట్యూడ్ చూపించే వారిని పక్కన పెడుతున్నారు. అందుకే లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది అనేది వర్మ అభిప్రాయం. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ స్టార్స్ కి మరియు బాలీవుడ్ స్టార్స్ కి మధ్య ఉన్న పలు తేడాలను ఎత్తి చూపిస్తూ చేసిన వాదన మరియు వ్యక్తపరచిన అభిప్రాయాలు లాజిక్ గానే ఉన్నాయంటూ సామాన్యులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకులు తగ్గించుకోవాలనుకుంటున్న ఆటిట్యూడ్ ను మన హీరోలు తమ లో రాకుండా చూసుకుంటే బెటర్. ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా హిందీ సినిమా పరిశ్రమకు చెందిన వారు మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారి నుండి నేర్చుకోవడం.. కాపీ కొట్టడం చేయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.