Begin typing your search above and press return to search.
కొత్త జంట హనీమూన్ కోసమే రెండు నెలలు
By: Tupaki Desk | 11 Dec 2021 8:30 AM GMTవిక్కీ కౌశల్-కత్రినాకైఫ్ జంట వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఇక తదుపరి ఘట్టం ముంబైలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. భారీ విందు ఏర్పాటు కోసం విక్కీ-క్యాట్ ఫ్యామిలీస్ రెడీ అవుతున్నాయి. పెళ్లి వేడుకకు అతికొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఈనేపథ్యంలో బంధువులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలందరికి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అటుపై హానీమూన్ ప్లాన్ చేసుకోనున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులందర్నీ నవదంపతులు ఖాళీ చేతులతో పంపించలేదు. తమని ఆశీర్వదించడానికి రాజస్థాన్ వరకూ వచ్చినవారికి పంజీబీ మిఠాయి స్వీట్ బాక్స్ తో పాటు అందులో కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖ కూడా రాసిపెట్టారు.
``మా జీవితంలో కొత్త ప్రయాణం మీ అందరి సమక్షంలో ప్రారంభమైంది. మీరాక ..ఆశీర్వదాలు మా పెళ్లి రోజుని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఇక్కడ ఎంతో సంతోషంగా పెళ్లి జరిగింది. అతిధులంతా ఈ మూవ్ మెంట్స్ ని ఆస్వాదించారని ఆశిస్తున్నాం. ఈ పెళ్లి ప్రారంభ వేడుక మాత్రమే. మరెన్నో సంబరాలకు తప్పక హాజరవ్వాలి`` అని లేఖలో రాసి ఉంది.
ఇంకా మరెన్నో వేడుకల్లో పాలు పంచుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇతర పరిశ్రమ వర్గాల కోసం బంధుమిత్రుల కోసం భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. రిసెప్షన్ అనంతరం ఏకంగా ఈ జంట హానీమూన్ కి వెళ్లనున్నారు. రెండు నెలలు పాటు యూరప్ లో హీనీమూన్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ట్రిప్ ను సంపూర్ణంగా ఆస్వాధించేందుకు యురప్ లోని ఎగ్జోటిక్ లొకేషన్లను చుట్టేయాలని జంట ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ప్లానింగ్ అంతా మాత్రం విక్కీ కౌశల్ దేనట. పెళ్లి కత్రినా ఇష్ట ప్రకారం రాజస్థాన్ లో జరిగిందని.. హానీమూన్ మాత్రం వీక్కీ ప్లాన్ అని సమాచారం. అంటే వీక్కీ- క్యాట్ లు మళ్లీ సినిమా షూటింగ్ ల్లో జాయిన్ అవ్వడానికి రెండు..మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా ఫుల్ గా వ్యక్తిగత రొమాంటిక్ జీవితాన్ని ఆస్వాధిస్తారు.