Begin typing your search above and press return to search.
రెండు మూడేళ్ల తర్వాత పుట్టే పిల్లల కోసం పేర్లు వెతుకుతున్న బాలీవుడ్ జంట
By: Tupaki Desk | 18 Oct 2021 3:42 AM GMTఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతను గుర్తు చేసేలా ఉంది తాజా ఉదంతం. బాలీవుడ్ క్యూట్ జంటల్లో ఒకరు రణ్ వీర్ సింగ్.. దీపికా పదుకునే. వీరిద్దరి రీల్ కాంబినేషన్ మాత్రమే కాదు.. రియల్ కాంబినేషన్ సైతం అదిరిపోయేలా ఉంటుంది. ఇటీవల కాలంలో పెద్ద స్టార్లు అంతా సినిమాల్లో బిజీగా ఉంటూనే.. టీవీ షోలకు.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద పని చేస్తున్నారు. ప్రస్తుతం ‘సూర్యవంశీ, ‘83’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ పలు సినిమాల్లో నటిస్తున్న అతడు బిజీబిజీగా ఉన్నాడు.
అయినప్పటికీ తాజాగా ఒక షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కలర్స్ లో టెలికాస్ట్ అయ్యే ఈ షో (బిగ్ పిక్చర్) కు సంబంధించిన ఒక ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇది కాస్తా అందరి చూపు పడేలా ఉంది. దీనికి కారణం.. తన వ్యక్తిగత ముచ్చట్లను రణ్ వీర్ సింగ్ వెల్లడించటమే. తాము మరో రెండు మూడేళ్లలో ఒక పాపకు తండ్రిని అవుతానని.. అందుకే తన పేరును వెతుకుతున్నట్లుగా వెల్లడించారు.
తనకు పెళ్లి అయిన విషయం అందరికి తెలిసిందేన.ి.. మరో రెండు.. మూడేళ్లలో పిల్లలు కూడా పుడతారన్నారు. ‘మీ వదిన చాలా క్యూట్ గా ఉంటుంది. నేను చాలాసార్లు నీలాంటి పాపను ఇవ్వు. నా లైఫ్ సెట్ అయిపోతుందని అడుగుతుంటానని చెప్పారు. పాప వస్తే మా జీవితం అద్భుతంగా మారుతుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పుట్టే పాప కోసం మంచి పేరు వెతుకుతున్నట్లుగా చెప్పిన రణ్ వీర్ మాటల్ని విన్నంతనే.. తెలుగువారికి అప్రయత్నంగా ఈ సామెత గుర్తుకురావటం ఖాయం. అయినా.. దీపికాకు ప్రెగ్నెన్సీ వస్తే.. పుట్టేది అమ్మాయా? అబ్బాయా? ముందే ఎలా తెలుస్తుంది? పుట్టే పాప లింగ నిర్దారణ నేరం కదా? ఈ విషయంరణవీర్ కు తెలీదా? ఒకవేళ అతగాడు అనుకున్నట్లు పాప పేరు ఫైనల్ చేసుకున్న తర్వాత.. అబ్బాయి పుడితే?