Begin typing your search above and press return to search.

యంగ్ మ్యాన్ - ఓల్డ్ లేడీ జోడీ జోడీ!

By:  Tupaki Desk   |   11 Nov 2018 7:23 AM GMT
యంగ్ మ్యాన్ - ఓల్డ్ లేడీ జోడీ జోడీ!
X
ఇద్దరు పెళ్ళిచేసుకోవాలంటే చాలా విషయాలు అలోచించే ఆ నిర్ణయం తీసుకుంటారు. అది పెద్దలు కుదిర్చిన వివాహం అయినా కావచ్చు లేదా పిల్లలు కుదుర్చుకునే ప్రేమ వివాహం అయినా కావచ్చు. ప్రేమ వివాహంలో ఏం ఆలోచిస్తారని కొందరు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది గానీ వాళ్ళు కూడా బాగా ఆలోచించే సాహసానికి పూనుకుంటారు! ఇలాంటి నెవర్ ఎండింగ్ చర్చలు సాగే కాన్సెప్ట్ ను పక్కన బెట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గా బాలీవుడ్ కి వెళ్దాం. అక్కడ ఊపందుకుంటున్న ఒక ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం.

సహజంగా పెళ్ళి చేసుకునేముందు గమనించే విషయాలలో ఈడు జోడు ఒకటి. ఇప్పుడు బాలీవుడ్ దీనికి చెల్లు చీటీ ఇస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే తమకంటే ఐదు.. పది.. పదిహేనేళ్ళు వయసు తక్కువగా ఉండే వారిని హీరోయిన్లు పెళ్ళి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం హాట్ టాపిక్ అయింది అంటే ముఖ్యంగా ప్రియాంక చోప్రా.. మలైకా అరారా.. సుష్మిత సేన్ లాంటి వారి వల్లే. ఇలా హీరోయిన్లు తమకంటే చిన్న వారిని చేసుకునే ట్రెండ్ చాలా ఏళ్ళ ముందునుండే ఉంది కానీ ఈమధ్య ఆ వయసు తేడా మరీ ఎక్కువ అవుతోంది.

గతంలో ఏదో రెండు మూడేళ్ళంటే సరేలే అనుకునే వారు ఇప్పుడు ఆ వయసు తేడా పదేళ్ళు కూడా దాటుతుండడం ముఖ్యంగా నలభైల్లో ఉందే ప్రౌఢ మహిళలు పాతిక ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళపై మనసు పారేసుకుంటూ ఉండడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. బాలీవుడ్ లో ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి గానీ ఇక్కడ అలాంటి జంటల వివరాలు ఉన్నాయి. మరి బాలీవుడ్ లో ఊపందుకుంటున్న ఈ ట్రెండ్ గురించి మీకు తెలియాలిగా..ఒక సారి ఆ జంటలెవరో చూడండి.

* గ్లోబల్ సుందరిగా పేరుతెచ్చుకున్న ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను డిసెంబర్లో వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ప్రియాంక కంటే నిక్ పదేళ్ళు చిన్నవాడు.

* మలైకా అరోరా ఖాన్ తన భర్త అర్బాజ్ ఖాన్ నుండి కొంతకాలం క్రితం విడాకులు తీసుకుంది. యువ బాలీవుడ్ హీరో.. బోనీ కపూర్ కుమారుడు అయిన అర్జున్ కపూర్ తో ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది. ఈ లవ్ జంటకు దాదాపు 12 ఏళ్ళు తేడా. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని అందుకే పబ్లిక్ గా కలిసి తిరుగుతున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

* మాజీ విశ్వసుందరి సుష్మిత సేన్ వయసు ఈ నలభై రెండేళ్ళు. ఇద్దరు పిల్లలను ఎప్పుడో దత్తత తీసుకుని సింగిల్ మదర్ గా పెంచుకుంటోంది. తాజాగా తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడైన మోడల్ రోమన్ షాల్ ప్రేమలో పడింది. ఇద్దరూ వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారట.

* ఊర్మిళ మతోండ్కర్ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. కానీ ఆమె పెళ్ళి విషయం అంత పాపులర్ కాలేదు. ఆమె తన కంటే తొమ్మిదేళ్ళు చిన్నవాడైన కాశ్మీరీ వ్యాపారవేత్త మొహసిన్ అక్తర్ మిర్ ను 2016 లో పెళ్ళిచేసుకుంది.

* బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా అదే ఏడాది తన బాయ్ ఫ్రెండ్ జీన్ గుడినఫ్ ను పెళ్ళి చేసుకుంది. ప్రీతీ కంటే తన భర్త పదేళ్ళు చిన్నవాడు.

* కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన ఫరా ఖాన్ తనకంటే ఎనిమిదేళ్ళు చిన్నవాడైన శిరీష్ కుందర్ ను 2004 లో పెళ్లి చేసుకుంది.

* బాలీవుడ్ నటి టీవీ హోస్ట్ అయిన అర్చన పూరన్ సింగ్ మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తనకంటే ఏడేళ్ళు చిన్నవాడిన పర్మీత్ సేథీ ని వివాహం చేసుకుంది.

*సీనియర్ నటుడు ఆదిత్య పంచోలి కంటే అయన భార్య జరీనా వహాబ్ వయసులో ఆరేళ్ళు పెద్ద.

పైన జంటలన్నీ ఐదేళ్ళ కంటే ఎక్కువ తేడా ఉన్నవి. ఇక ఐదేళ్ళు అంతకంటే వయసు తేడా ఉన్న జంటలు కూడా చాలానే ఉన్నాయి.

సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు బాలీవుడ్ నటి అయిన సోహా అలీ ఖాన్ తనకంటే ఐదేళ్ళు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు కునాల్ ఖేము ను 2015 లో పెళ్ళి చేసుకుంది. బిపాషా బసు తనకంటే నాలుగేళ్ళు చిన్న వాడు అయిన కరణ్ సింగ్ గ్రోవర్ ను 2016 లో పెళ్ళి చేసుకుంది. ఇక ఐశ్వర్య రాయ్ కంటే ఆమె భర్త అభిషేక్ బచ్చన్ మూడేళ్ళు చిన్నవాడు. నేహా ధూపియా ఈమధ్యనే తనకంటే రెండేళ్ళు చిన్నవాడైన అంగద్ బేడిని పెళ్ళిచేసుకుంది.