Begin typing your search above and press return to search.
ప్రియుడితో ఇంట్లోనే కాపురం పెట్టినా పెళ్లాడదట?
By: Tupaki Desk | 16 Jun 2022 2:30 AM GMTప్రియుడితో ఇంట్లోనే కాపురం పెట్టింది. అందుకు తన తండ్రి నుంచి అనుమతి కూడా తీసుకుంది. తన డాడ్ ఉండే గదికి పక్క గదిలోనే ప్రియుడితో నివాసం ఉంటోంది. అంతేకాదు.. ఆ ఇద్దరి సహజీవనానికి ఆ తండ్రి గారి నుంచి కావాల్సినంత సపోర్ట్ ఉంది. ఇది పాశ్చాత్య సంస్కృతి అంటూ విమర్శించేవాళ్లకు కౌంటర్లు కూడా వేస్తుంటారాయన. తండ్రి కూతుళ్లిద్దరూ కలిసి దీనిపై ఏకంగా ఇంటర్వ్యూలే ఇచ్చారు. ఇంతకీ ఎవరీ గుడ్ డాడీ .. ఎవరీ గ్రేట్ డాటర్? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్.. ఆయన గారాల కుమార్తె ఆలియా గురించే ఇదంతా. డేటింగ్ యాప్ లో పరిచయమైన విదేశీ బాయ్ ఫ్రెండ్ షాన్ గ్రెగోయిర్ తో ఆలియా చాలా కాలంగా సహజీవనంలో ఉంది. తన తండ్రి గారు ఉండే అదే ఇంట్లో ప్రియుడితో కలిసి నివాసం ఉంటోందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. అయితే ఇంకా ఎన్నాళ్లు ఇలా? త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా? అంటూ అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తుంటాయ్. కానీ దానికి ఆలియా నుంచి సరైన సమాధానం లేదు.
డేటింగ్ యాప్ లో షాన్ గ్రెగోయిర్ ను ఆలియా కశ్యప్ కలిసినప్పటి నుంచి ప్రతిదీ ఓపెన్ గానే చెబుతోంది. ఆమె తరచుగా అతడితో రొమాంటిక్ డేట్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ జంట తమ రెండవ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రియుడు షాన్ స్వయంగా ఆలియా వేలికి ఉంగరం పెట్టాలనుందని నోట్ ను రాశాడు. షాన్ తన ప్రియురాలిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా హింట్ ఇచ్చాడు. దీంతో ఇక ఈ జంట పెళ్లికి రెడీ అంటూ అభిమానులు ఊహిస్తున్నారు.
షాన్ ఆలియా వేలికి ఉంగరం పెట్టడానికి వేచి ఉండలేనని అనడంతో ఇన్నాళ్టికి ఒక క్లారిటీ వచ్చింది. షాన్ ఆ లేఖలో ఏమని రాసారంటే.. ``నా స్వీట్ ఏంజెల్ కి 2 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నేను నా లైఫ్ డాళింగ్ ని ప్రేమగా పిలుస్తాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ .. ప్రతిదానిలో భాగస్వామి! ప్రతి రోజు నువ్వు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నావు. నేను ఎదగడానికి నీవు నాకు ఇచ్చే స్పేస్ ఎంతో గొప్పది. ఓహ్ నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.
నీ వేలికి ఉంగరం పెట్టే రోజు కోసం హార్ట్ ఫుల్ గా ఎదురు చూస్తున్నాను`` అని అతడు రాసాడు. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో ఆలియా తన ప్రియుడు షాన్ ను కౌగిలించుకుని ముద్దులాడేస్తూ కనిపించింది. ఈ జంట ఇటీవలి వెకేషన్ ఫోటోలను కూడా షేర్ చేసారు. ఆలియా కూడా ఇన్ స్టాగ్రామ్ లో షాన్ కు హృదయపూర్వక పోస్ట్ ను అంకితమిచ్చింది. ``నా బెస్ట్ ఫ్రెండ్ & సోల్ మేట్ తో నా జీవితంలో అత్యంత అద్భుతమైన 2 సంవత్సరాలు గడిచాయి. వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను`` అని రాసింది.
దీనికి వారి అభిమానులు స్నేహితులు శుభాకాంక్షలతో హీటెక్కించారు. ``ఆ భారతీయ వివాహం కోసం వేచి ఉండలేను`` అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. ``మీ పెళ్లికి నన్ను ఆహ్వానిస్తే బాగుంటుంది`` అని మరొకరు రాశారు. వేరొక వినియోగదారు``వార్షికోత్సవ శుభాకాంక్షలు క్యూటీస్... మీరు ఇప్పుడే ప్రపోజ్ చేసారు. అతను కూడాను`` అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. డేటింగ్ యాప్ లో షాన్ ను కలిసిన ఆలియా రెగ్యులర్ గా అతనితో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. అవి వైరల్ గా మారుతున్నాయి. గొప్ప ఫిలింమేకర్ అనురాగ్ వారసురాలు ఆలియా ఫిలింమేకింగ్ పై ఆసక్తిగా లేదు. ప్రస్తుతం ప్రేమాయణంపై మాత్రమే ఆసక్తిగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.