Begin typing your search above and press return to search.

రికార్డులు ఔట్ అంటే మ‌న హీరోలు ఒప్పుకుంటారా?

By:  Tupaki Desk   |   15 July 2020 6:10 AM GMT
రికార్డులు ఔట్ అంటే మ‌న హీరోలు ఒప్పుకుంటారా?
X
మ‌హ‌మ్మారీ పాఠాలు కొన‌సాగుతున్నాయి. భ‌విష్యత్ ఓటీటీ-డిజిట‌ల్ దేన‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెరుచుకునేందుకు ఆస్కారం క‌నిపించ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే బాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్ చేసిన వ్యాఖ్య సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ ఆయ‌నేమ‌ని కామెంట్ చేశారు? అంటే..

థియేట‌ర్ వ్య‌వ‌స్థ ఏడాది పాటు చ‌నిపోయిన‌ట్టే. స్టార్ హీరోలు ఇక‌పై ఓటీటీల‌కు వెళ్ల‌డ‌మే ఉత్త‌మం. థియేట్రిక‌ల్ స్టార్ సిస్ట‌మ్ చ‌నిపోయింది. మొద‌టి వారం 100 కోట్ల వ్యాపారం అంతా ఔట్‌`` అంటూ వ్యాఖ్యానించారు. ఓటీటీకి వెళ్ల‌డం ఒక్క‌టే మునుముందు అంద‌రు స్టార్ హీరోల‌కు సుర‌క్షితం అని కూడా ఆయ‌న సూచించారు. స్టార్స్ కి మరో దిక్కు లేదు అని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే మునుముందు స్టార్ హీరోలంతా ఓటీటీల‌పైనే దృష్టి సారిస్తారా? అన్న‌ది ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

ఇప్ప‌టికే ప‌లువురు అగ్ర హీరోలు.. బ‌డా బ్యాన‌ర్ల నిర్మాత‌లు సొంత ఓటీటీల‌కు ట్రై చేస్తున్నారంటేనే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఒక‌సారి మ‌హ‌మ్మారీ క్రైసిస్ తొల‌గిపోయి తిరిగి య‌థావిథి స్థితి వ‌చ్చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? అన‌్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. అయితే అప్ప‌టికి ఓటీటీకి అడిక్ట్ అయిన వాళ్లు థియేట‌ర్ల వైపు చూస్తారా? అన్న‌ది చ‌ర్చంచ‌ద‌గిన పాయింట్. స్టార్స్ ఓటీటీల్లోకి వ‌చ్చి యాప్ లను క్రియేట్ చేసుకొని అందులో సినిమాలను రిలీజ్ చేసుకోవ‌డం ఉత్త‌మం అని శేఖ‌ర్ క‌పూర్ అన‌డం చూస్తుంటే అటు బాలీవుడ్ స్టార్లే కాదు ఇటు టాలీవుడ్ స్టార్లు ఆ దిశ‌గా ఆలోచించ‌డ‌మే ఉత్త‌మం అని అర్థ‌మ‌వుతోంది.