Begin typing your search above and press return to search.

#DRUGS బాలీవుడ్‌లో మంచి వుంది.. చెడు వుంది!

By:  Tupaki Desk   |   14 Sep 2020 9:50 AM GMT
#DRUGS బాలీవుడ్‌లో మంచి వుంది.. చెడు వుంది!
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న అనుమానాస్ప‌దంగా మృతి చెంద‌డంతో బాలీవుడ్‌లో నెపోటిజ‌మ్‌, ఇన్ సైడ‌ర్స్‌, ఔట్ సైడ‌ర్స్ అనే చ‌ర్చ‌మొద‌లైంది. సోష‌ల్‌మీడియాలోనే చ‌ర్చ హోరెత్తింది. బంధుప్రీతి కార‌ణంగానే సుశాంత్ మృతి చెందాడంటూ నెటిజ‌న్స్ బాలీవుడ్ పై దుమ్మెత్తిపోశారు. దీనిపై కొంత మంది స్టార్స్ మాత్ర‌మే ఓఎన్ అవుతున్నా కొంత మంది మాత్రం ఇప్ప‌టికీ మౌనంగానే వుంటున్నారు.

అదితీరావు హైద‌రీ మాత్రం బాలీవుడ్‌లో మంచీ చెడు రెండూ వున్నాయ‌ని వాదిస్తోంది. చెండు కంటే మంచే ఎక్కువ‌గా వుంద‌ని చెబుతోంది. ఈ విష‌యం ఏదో ఒక రోజు నిరూపించ‌బ‌డుతుంద‌ని చెబుతోంది. ఇండ‌స్ట్రీ ఓ ఒక్క‌రినీ విడ‌దీయ‌లేద‌ని మ‌న మంతా హ్యుమ‌న్స్ అని ఏదో ఒక సంద‌ర్భంలో త‌ప్పులు చేస్తుంటామ‌ని ఆ త‌ప్పుల‌ని ఇగ్నేర్ చేస్తే బాలీవుడ్ అందంగా క‌నిపిస్తుంద‌ని ఓ జాతీయ మీడియాకు వెల్ల‌డించింది ఆదితిరావు హైద‌రీ.

ఈ రంగంలో వున్న వాళ్ల‌మంతా ఒక్క‌టిగా నిల‌బ‌డ‌తామంది. ప్ర‌జ‌లు మా వెన్నంటి వున్నంత కాలం మేం ఎప్పుడూ క‌లిసే వుంటాం. క‌లిసే నిల‌బ‌డ‌తాం. త‌న‌ని చాలా మంది అవుట్ సైడ‌ర్ అంటూ వుంటారు. దాన్ని నేను అస్స‌లు న‌మ్మ‌ను. `ప్ర‌జ‌లు ఎప్పుడూ బ‌య‌టి వ్య‌క్తుల గురించి మాట్లాడుతుంటారు. కానీ నాకు స‌మ‌స్య వుందంటే నా త‌రుపున మాట్లాడ‌టానికి నాకు స‌పోర్ట్‌గా నిల‌వ‌డానికి ఇండ‌స్ట్రీలో చాలా మంది వున్నారు. అయితే నన్ను బయటి వ్యక్తిగా పరిగణించినప్పటికీ వారు నాకు సహాయం చేస్తారు. కాని నన్ను నేను బయటి వ్యక్తిగా పరిగణించడం లేదు` అని ఆదితీరావు హైద‌రీ తెలిపింది.