Begin typing your search above and press return to search.
డ్రగ్స్ టెన్షన్ .. NCB పిలుపుతో దీపిక గోవా నుంచి వెనక్కి!
By: Tupaki Desk | 23 Sep 2020 9:30 AM GMTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రకరకాల ట్విస్టులు బాలీవుడ్ ని అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుతో డ్రగ్స్ లింకప్ అయ్యి ఉండడమే ఈ టెన్షన్ కి కారణం. మాదకద్రవ్యాల కేసులో దీపిక పదుకొనే పేరు హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె పేరు వెలువడిన తర్వాత న్యాయ బృందాన్ని సంప్రదించేందుకు త్వరలో గోవా నుండి బయలుదేరనుందని తెలుస్తోంది.
దీపికా పదుకొనే ప్రస్తుతం తన చిత్రం షూటింగ్ కోసం గోవాలో ఉంది. తాజా పరిణామంతో తనకు ఇబ్బంది తప్పడం లేదు. ఈ కేసు దర్యాప్తులో దీపిక మాత్రమే కాదు. తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ పేరు కూడా జాతీయ మీడియాలో బయటికి వచ్చింది. తనని ఇప్పటికే విచారణ కోసం ఎన్.సిబి పిలిచినట్లు సమాచారం. అయితే కరిష్మా అనారోగ్య కారణంగా సెప్టెంబర్ 25 వరకు విచారణలో మినహాయింపు కోరింది.
ఎవ్వర్ లేటెస్ట్ సమాచారం ప్రకారం... మాదకద్రవ్యాల కోణంలో పేరు వెలువడిన తరువాత దీపికా పదుకొనే దిల్లీలోని తన న్యాయవాద బృందంతో సంప్రదింపులు జరిపారు. షవర్న్ బాత్రాతో కలిసి తన రాబోయే చిత్రం షూటింగ్ కోసం దీపిక ప్రస్తుతం గోవాలో ఉంది. అయితే తాజా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా త్వరలో గోవాను వదిలి ముంబైకి రానుందని తెలుస్తోంది.
మరోవైపు ఎన్.సిబి టాలెంట్ మేనేజర్ జయ సాహాను మంగళవారం నాడు 6 గంటల పాటు విచారించింది. అయితే.. ఏజెన్సీ ఆమెను. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ శ్రుతి మోడిని బుధవారం నాడు పిలిచినట్లు సమాచారం. అంతే కాదు.. KWAN ఏజెన్సీ డైరెక్టర్ ధ్రువ్ చిట్గోపేకర్ కూడా ఏజెన్సీ ముందు హాజరయ్యారు. జయ సాహా ఈ టాలెంట్ ఏజెన్సీలో ఉద్యోగి. అలాగే దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్..పేరు డ్రగ్స్ విచారణలో బయటపడింది. రియా చక్రవర్తి- షోయిక్- శామ్యూల్ మిరాండా- దీపేశ్ సావంత్ ల కస్టడీని 2020 అక్టోబర్ 6 వరకు పొడిగించారు.