Begin typing your search above and press return to search.
#DRUGS బాలీవుడ్ స్టార్ల పేర్లేవి రియా లీక్ చేయలేదన్న లాయర్
By: Tupaki Desk | 24 Sep 2020 4:30 AM GMTసుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ కోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 12 మందిని అరెస్టులు చేశారు. ఇండస్ట్రీ టాప్ స్టార్లతో పెద్ద జాబితాని ఎన్.సి.బి-సిబిఐ బృందాలు రెడీ చేశాయన్న చర్చా సాగుతోంది. కూపీ లాగితే రియా చక్రవర్తి పలువురు స్టార్ల పేర్లను బయటపెట్టిందన్న ప్రచారం సాగిపోయింది. రియా 25 మంది పేర్లను వెల్లడించిందని జాతీయ మీడియాలు కథనాలు ప్రచురించాయి.
అయితే ఇదేదీ నిజం కాదని రియా న్యాయవాది సతీష్ మనేషిందే ఖండించారు. బాలీవుడ్ స్టార్ల పేర్లను రియా వెల్లడించలేదని అన్నారు. రియా పేర్లు వెల్లడించినట్లు ఎన్.సిబి వాదించింది అంటే అది ఎట్టిపరిస్థితిలో అవాస్తవమని న్యాయవాది తెలిపారు. ప్రముఖ చానెల్ తో రియా చక్రవర్తి న్యాయవాది మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. రియా లీకులిచ్చిందంటూ ఎన్.సిబి వాదిస్తే అది ఫక్తు అబద్ధమని ఆయన అన్నారు.
పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- నేపాల్ వంటి దేశాల నుండి డ్రగ్ పెడ్లర్లను ఎన్.సిబి వెళ్లి పట్టుకోవాలని సతీష్ మనేషిందే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎన్.సిబి ఇప్పటివరకు ఏ దర్యాప్తు చేపట్టినా వారు తమ క్లయింట్ రియా చక్రవర్తి ఇన్వాల్వ్ మెంట్ ఉందని నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. రియా చక్రవర్తి తరపున ఎలాంటి తప్పులకు రుజువు కనుగొనలేదని అన్నారు. రియాను డ్రగ్ సిండికేట్ తో లింక్ చేసే ఎలాంటి ఆధారాలు ఎన్.సి.బి వద్ద లేవని సతీష్ మనేషిందే పేర్కొన్నారు.
రియా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిలో భాగమైనందున తనను అపరాధిగా పేర్కొనలేమని ఆయన వెల్లడించారు. బాలీవుడ్ నుండి సారా అలీ ఖాన్- శ్రద్ధా కపూర్- దీపికా పదుకొనే వంటి కథానాయికల్ని ఎన్.సిబి విచారణకు పిలవడం ఈ మహమ్మారి వంటి సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించడమేనని న్యాయవాది సతీష్ మాన్ షిందే జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.