Begin typing your search above and press return to search.

భయంతో బాలీవుడ్‌ మరింత కష్టాల్లో కూరుకు పోతుందా!

By:  Tupaki Desk   |   19 Aug 2022 7:30 AM GMT
భయంతో బాలీవుడ్‌ మరింత కష్టాల్లో కూరుకు పోతుందా!
X
బాలీవుడ్‌ సినిమా కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. కొన్ని సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా వాటిని థియేటర్లలో చూసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు.

సౌత్‌ సినిమాలు ఉత్తరాదిన థియేటర్లలో విడుదల అయితే జనాలు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు కానీ హిందీ సినిమాలను చూసేందుకు మాత్రం అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.

ఇటీవల విడుదల అయిన బాలీవుడ్‌ సూపర్ స్టార్స్ సినిమాల ఓపెనింగ్ వసూళ్లు కూడా అత్యంత దారుణంగా ఉందటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఉన్నారు. ఒకటి కాకుంటే ఒకటి అయినా బాలీవుడ్‌ లో సక్సెస్‌ అవుతుందేమో అనుకుంటే కమర్షియల్ గా గొప్ప సినిమాలుగా ఏ ఒక్కటి కూడా నిలిచిన దాఖలాలు లేవు.

రూ.50 నుండి 60 కోట్లను వసూళ్లు చేస్తేనే ఆ సినిమాను చాలా గొప్ప విజయం సాధించిన సినిమా గా చెప్పుకుంటున్న పరిస్థితి. బాలీవుడ్‌ సినిమాను థియేటర్‌ రిలీజ్ చేయాలంటేనే భయపడుతున్నారు. ఓటీటీ ద్వారా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో వాటిని కాదని థియేటర్ రిలీజ్ కు వెళ్తే కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడా రావడం లేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ లో ఇప్పుడు థియేటర్‌ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్ శ్రేయస్కరం అనే అభిప్రాయం కు వచ్చారు. ఒక వైపు టాలీవుడ్ సినిమాలు విడుదల అయిన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ నిర్ణయాన్ని తీసుకుంటే హిందీ సినిమాలను మాత్రం థియేటర్‌ రిలీజ్ చేస్తే వసూళ్లు రావనే భయంతో డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.

టాలీవుడ్ లో పరిస్థితి మెల్ల మెల్లగా కుదుట పడుతుంది. అదే పరిస్థితి బాలీవుడ్‌ లో కూడా మొదలు అయ్యే అవకాశం ఉంది. కానీ బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ చాలా మంది తమ సినిమాలను భయంతో డైరెక్ట్‌ ఓటీటీకి ఇస్తున్నారు. అక్షయ్‌ కుమార్ మూవీ మొదలుకుని పలు చిన్నా చితకా పెద్ద సినిమాలను ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్‌ ఓటీటీ తో బాలీవుడ్ మరింత కష్టాల్లో కూరుకు పోయే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో అనేది చూడాలి.