Begin typing your search above and press return to search.
చివరికి సౌత్ ట్యాలెంట్ ని పొగడాల్సొస్తోంది!
By: Tupaki Desk | 16 Jun 2022 6:30 AM GMTఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడు అంతా మారింది. బాలీవుడ్ కి సీన్ సితార అయిపోతోంది. అక్కడ సరైన హిట్టు లేక స్టార్లు స్టార్ ఫిలింమేకర్స్ గిలగిలలాడుతున్నారు. హిట్టు కోసం సౌత్ పై ఆధారపడే ధైన్యం కనిపిస్తోంది. నిజానికి ఇది సౌత్ గర్వించదగ్గ సన్నివేశం. ఉత్తరాది బెల్ట్ లో పూణే ఫిలింఇనిస్టిట్యూట్ పాఠాలు వర్కవుట్ కావడం లేదనేందుకు ... సౌత్ పాన్ ఇండియా సినిమాలతో పోటీపడే సత్తా పుట్టడం లేదనేందుకు ఈ సన్నివేశం సాక్ష్యంగా నిలుస్తోంది.
అంతేకాదు.. ఇంతకుముందులా హిందీ స్టార్లు బింకం ప్రదర్శించే సీన్ కూడా కనిపించడం లేదు. సౌత్ గొప్పతనాన్ని ఒప్పుకుని తీరాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. వాళ్లు వస్తే వెయ్యి కోట్లు కొల్లగొడుతున్నారు! అన్నది ఊహించలేకపోతున్నారు. ఇటీవలి పుష్ప- ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 సక్సెస్ చూసి ఇలాంటివి తాము ఎందుకు తీయలేకపోతున్నామని తలలు పట్టుకుంటున్నారు హిందీ మేకర్స్. దీంతో ఇప్పుడు హిందీ స్టార్లు యూటర్న్ తీసుకుని బింకాన్ని ప్రదర్శించకుండా నేరుగా సౌత్ సినిమా కథల్ని సౌత్ స్టార్లను పొగిడేయడం ప్రారంభించారు. ఇది ఊహించని సన్నివేశం. బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం సౌత్ ట్యాలెంటును కొనియాడడం అన్నది దశాబ్ధాల హిస్టరీలో ఇదే మొదటిసారి. అసలు ఇటువైపు చూసేందుకే ఇష్టపడని వర్ణ జాత్యాహంకార పరిశ్రమ వ్యక్తులు ఇప్పుడు సౌత్ లేనిదే బతకలేం అన్నట్టుగా మారిపోయారు.
ఇటీవల అనుపమ్ ఖేర్ లాంటి ఉత్తమ నటుడు మన రాజమౌళిని మన స్టార్ హీరోల్ని విపరీతంగా పొగిడేశారు. కరణ్ జోహార్ - తరణ్ ఆదర్శ్ లాంటి ప్రముఖులు మన ట్యాలెంట్ ని చాలా కాలం క్రితమే గుర్తించారు. బాహుబలితో అన్ని భ్రమలు తొలిగిపోయాయి వీళ్లకు. ఇప్పుడు ఖాన్ లు కపూర్ లు ఖిలాడీలు కుమార్ లు రోషన్ లు ధావన్ లు అందరూ దిగొస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిగా తెలుగు స్టార్లను పొగిడేస్తున్నారు. ఇంతకుముందే ఖిలాడీ కుమార్ అక్షయ్ ఏకంగా తన సినిమాలో సౌత్ స్టార్ సూర్య నటించాలని పట్టుబట్టారు. ఏకంగా ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.
ఇక రణబీర్ కపూర్ అయితే తన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని సౌత్ లో అత్యంత భారీగా విడుదల చేయాలని తపిస్తున్నాడు. హైదరాబాద్ ప్రమోషన్స్ లో సౌత్ ప్రతిభను పొగిడేస్తున్నాడు. రణబీర్ ఏకంగా మెట్రోల్ని వదిలేసి స్టీల్ సిటీ వైజాగ్ కి వచ్చి ప్రమోషన్ చేస్తున్నాడంటే ఎంతగా మారాడో అర్థం చేసుకోవాలి. అంతేకాదు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగాతో యానిమల్ లాంటి రగ్గ్ డ్ సినిమా చేస్తున్నాడు. రణబీర్ కెరీర్ లోనే ప్రయోగాత్మక సినిమా చేస్తోంది ఒక సౌత్ డైరెక్టర్.
ఇప్పుడు ధావన్ బోయ్ వంతు. యువ ప్రతిభావంతుడు వరుణ్ దేవన్ ఏకంగా సౌత్ ఫిల్మ్ మేకర్స్ - రైటర్స్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని పొగిడేశాడు. దర్శకధీరుడు రాజమౌళి సార్ డైరెక్టర్ల లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గ్రేట్.. ఎఫ్3 తీసిన దర్శకుడు అద్భుతమైన కామెడీతో అలరిస్తున్నారు. పుష్ప దర్శకుడు అద్భుతం.. అంటూ పొగిడేశాడు. రాజమౌళి- సురేందర్ రెడ్డి- అనీల్ రావిపూడి - సుకుమార్ లను అతడు పొగిడేసాడంటే అర్థం చేసుకోవాలి.
ఒకానొక సమయంలో నేను సౌత్ నుంచి గొప్పగా ఇష్టపడిన సినిమా ఉంది. ఇది 'ప్రేమమ్' అనే మలయాళ చిత్రం. చాలా అందమైన చిత్రం. దీనికి అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఆ చిత్రం చేయడానికి మేము చాలా దగ్గరగా వెళ్లాం. నేను ఆల్ఫోన్స్ కలిశాం. అతను అద్భుతమైన వ్యక్తి.. కానీ ఏదో జరిగింది. దానివల్ల ఆ ప్రాజెక్ట్ ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదు... అని తెలిపాడు. దక్షిణాది ఫిలిం మేకర్స్ రచయితల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని నేను భావిస్తున్నాను. ఏదైనా మార్పు రావాలి.. అన్ని వైపుల నుంచి కలిసి పని చేసేందుకు సహకారం జరుగుతుంది. అలా చేస్తే అది చక్కగా గొప్పగా ఉంటుంది... అని వరుణ్ ధావన్ అన్నారు. ఇప్పటికే ఖాన్ లు కూడా దిగొచ్చి సౌత్ ట్యాలెంట్ కి అవకాశాలిస్తున్నారు. సౌత్ స్టార్లను కలుపుకుని పోతూ సినిమాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఉత్తరాది స్టార్లు అంతా చివరికి సౌత్ ట్యాలెంట్ ని పొగడాల్సొస్తోంది!
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. వరుణ్ తదుపరి 'భేదియా'లో నటిస్తున్నాడు. కృతి సనన్ ఈ హారర్ కామెడీలో నాయిక. జాన్వీ కపూర్ ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. ఫ్యామిలీమ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ లో వరుణ్ ధావన్- సమంత జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ధావన్ సౌత్ నాయికలకు అవకాశాలిస్తున్నారు ఇప్పుడు. ఇక పోతే షారూక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో నటించడం మరో కొసమెరుపు. షాహిద్ కపూర్ వరుసగా టాలీవుడ్ డైరెక్టర్లతో పని చేస్తున్నాడు.