Begin typing your search above and press return to search.
పూరి టెంపర్ బాలీవుడ్ కు బాగా సెట్ అయ్యింది
By: Tupaki Desk | 5 Jan 2019 6:41 AM GMTఎన్టీఆర్, పూరిల కాంబినేషన్ లో మూడేళ్ల క్రితం వచ్చిన ‘టెంపర్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి కథతో రూపొందిన ఆ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అయ్యింది. రణ్ వీర్ సింగ్ హీరోగా సారా అలీఖాన్ హీరోయిన్ గా రూపొందిన ‘టెంపర్’ రీమేక్ కు ‘సింబా’ అనే టైటిల్ ను పెట్టారు. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింబా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ఈ చిత్రానికి మరే పోటీ లేక పోవడంతో 200 కోట్ల క్లబ్ పై కన్ను వేసింది.
బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథ ఉండటంతో పాటు దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ మెంట్ తో సినిమాను తెరకెక్కించాడు. హీరో పాత్రను చాలా విభిన్నంగా చూపించి హిందీ ఆడియన్స్ ను అలరించేలా స్క్రీన్ ప్లే నడిపించాడు. తెలుగు ‘టెంపర్’ కు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి సింబాను తెరకెక్కించారు. బాలీవుడ్ యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘సింబా’ సినిమా లాంగ్ రన్ లో రెండు వందల కోట్లను ఈజీగానే దక్కించుకుంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.
గతంలో కూడా సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. కాని మరీ ఇంతగా విజయాన్ని అయితే సొంతం చేసుకోలేదు. టెంపర్ సినిమా కథ బాలీవుడ్ నేటివిటీకి దగ్గరగా ఉన్న కారణంగా ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. టెంపర్ కథ తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. ఓవర్సీస్ లో సింబా సినిమా సాధిస్తున్న వసూళ్ల అందరిలో ఆశ్చర్యంను కలిగిస్తుంది. అక్కడ దాదాపు 60 కోట్లను వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే జోరు కొనసాగితే 200 కోట్లను క్రాస్ చేసి 250 కోట్లల్లో కూడా కలెక్షన్స్ పడే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.