Begin typing your search above and press return to search.
రిషి కపూర్ అందుకే హీరో కావాల్సి వచ్చింది!
By: Tupaki Desk | 1 May 2020 10:10 AM GMTదేశాన్ని కరోనా కుదిపేస్తున్న టైంలో బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ హీరో ఇర్ఫాన్ ఖాన్ మృతి నుంచి కోలుకోకముందే లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ మరణం అందరిని కలిచివేసింది. గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన నిన్న మృతి చెందారు. రిషి కపూర్ మరణం పట్ల బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే రిషి కపూర్ హీరో ఎలా అయ్యారు? అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్‌లో అగ్ర కుటుంబంగా చెప్పుకునే పృథ్విరాజ్ కపూర్ కుటుంబంలో జన్మించారు రిషి కపూర్. కపూర్ కుటుంబంలో అందరూ సినీ యాక్టర్లే. సెప్టెంబర్ 4, 1952లో రాజ్ కపూర్, కృష్ణ రాజ్ కపూర్ లకు రెండో సంతానంగా రిషి కపూర్ జన్మించారు.
రిషి కపూర్ పెద్దగా చదువుకోలేదు. ఎనిమిదో తరగతి ఫెయిల్ అయ్యాడు. కానీ సినిమాలు అంటే ఇష్టం ఉండడంతో ఆ వైపుగా అడుగులు వేశాడు. తన తండ్రి రాజ్ కపూర్ హీరోగా 1970లో తెరకెక్కిన ‘మేరా నామ్ జోకర్’ చిత్రంతో బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వరించింది. కానీ అంతకుముందు ‘శ్రీ 420’ అనే చిత్రంలోని ఓ వాన పాటలో కనిపించారు. అయితే ఆ పాటలో కనిపించడం కోసం ఆ సినిమాలోని హీరోయిన్ అయిన నర్గీస్ చాక్లెట్లు కొనిచ్చారట. ఇక 1972లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకుడిగా తెరకెక్కించిన ‘బాబీ’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు రిషి కపూర్. ఈ సినిమాకి ముందుగా రాజేశ్ ఖన్నాను హీరోగా అనుకున్నారట. కానీ డబ్బులు లేక రిషి కపూర్ ని హీరోను చేశారు రాజ్ కపూర్.
మేరా నామ్ జోకర్’ సినిమాకు ఉన్న అప్పులు తీర్చడం కోసం ‘బాబీ’ సినిమాని తెరకెక్కించారు రాజ్ కపూర్. ఈ సినిమాలో రిషి కపూర్ సరసన డింపుల్ కపాడియా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి రిషి కపూర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక 2012లో వచ్చిన అగ్నిపత్ సినిమాలో ఆయన చేసిన ప్రతినాయకుడి పాత్రకు గాను ధీ టైమ్స్ అఫ్ ఇండియా నుంచి ఉత్తమ నటుడుగా అవార్డు కూడా దక్కింది. అయితే తను సినిమా యాక్టర్ కావడానికి కారణం తన తండ్రి రాజ్ కపూర్ అప్పులు తీర్చడానికే అని పలుమార్లు రిషి కపూర్ వెల్లడించారు.