Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరో నిద్రలేని రాత్రులు.. కారణం ఏంటంటే..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 7:30 AM GMT
బాలీవుడ్ హీరో నిద్రలేని రాత్రులు.. కారణం ఏంటంటే..!
X
బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్. కోవిడ్ ప్యాండమిక్ తర్వాత బాలీవుడ్ బడా స్టార్స్ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కోసం కిందా మీద పడుతుంటే అతను తన సినిమా భూల్ భూలియా 2 సినిమాతో హిట్ అందుకున్నాడు. బీ టౌన్ లో ప్రెజెంట్ ఫాం లో ఉన్న ఈ యువ హీరో నిద్రలేని రాత్రులు గడిపానని అంటున్నాడు. ఇంతకీ కార్తీక్ ఆర్యన్ ఎందుకు స్లీప్ లెస్ నైట్స్ గడపాల్సి వచ్చింది అంటే అది ఒక సినిమా కోసమని తెలుస్తుంది. కార్తీక్ ఆర్యన్ ఫ్రెడ్డీ మూవీ డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది.

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీ కోసం 14 కేజీల దాకా బరువు పెరిగాడట కార్తీక్ ఆర్యన్. ఆ టైం లో తనకు చాలా ఇబ్బంది కలిగిందని.. తను చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు కార్తీక్ ఆర్యన్. అంతేకాదు ఫిజికల్ గా కూడా చాలా వీక్ అయ్యానని చెప్పుకొచ్చారు. సినిమా కోసం స్టార్స్ ఎంత కష్టపడుతున్నారు అన్నదానికి ఇదొక ఉదహరణ. జస్ట్ రెండు గంటల సినిమా చూసి సినిమా గురించి నెగటివ్ టాక్ చెప్పేస్తారు. కానీ ఆ సినిమా వెనక ఉన్న కష్టం గురించి ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

టాలీవుడ్ లో కూడా మన స్టార్స్ సినిమా సినిమాకు తమ మేకోవర్ తో అలరిస్తారు. వీరిలో ప్రత్యేకంగా చెప్పాలంటే సైజ్ జీరో కోసం అనుష్క శెట్టి చాలా బరువు పెరిగింది. ఆ సినిమా కోసం అనుష్క తీసుకున్న రిస్క్ అంతా ఇంతా కాదు. అయితే సినిమా ఫలితం మాత్రం నిరాశపరచింది. అప్పుడు పెరిగిన వెయిట్ అనుష్క తన సినిమా ఆఫర్లను కాదనుకునేలా చేసింది. కార్తీక్ ఆర్యన్ కూడా ఫ్రెడ్డీ సినిమా కోసం ఏకంగా 14 కేజీల దాకా వెయిట్ గెయిన్ అయ్యాడు.

శశాంక్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ తర్వాత కార్తీక్ ఆర్యన్ సత్య ప్రేం కి కథ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో కియరా అద్వానితో అతను రొమాన్స్ చేస్తున్నాడు. అంతకుముందు కియరాతో కర్తీక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నట్టు మీడియా హడావిడి చేసింది. అయితే ఇప్పుడు అతనితో కాకుండా సిద్ధార్థ్ మల్హోత్రాతో కీరా డేటింగ్ లో ఉందని తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.