Begin typing your search above and press return to search.

విల‌నీ స‌రిగా పండ‌క‌పోతే హీరో ఉన్నా ఎందుక‌ని!

By:  Tupaki Desk   |   3 Nov 2020 12:30 AM GMT
విల‌నీ స‌రిగా పండ‌క‌పోతే హీరో ఉన్నా ఎందుక‌ని!
X
ఒక‌ప్ప‌టి సినిమాల్లో హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే విల‌న్ అంత‌కుమించి స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యేవాడు. దానివ‌ల్ల చివ‌రికి చెడుపై మంచి సాధించే విజ‌యం కిక్కిచ్చేది. ఆరంభం క‌ష్టం న‌ష్టం ఎదుర్కొన్నా చివ‌రికి ఈవిల్ పై హీరో గెలిచేవాడు. కానీ ఇప్పుడ‌లా కాదు. హీరో ముందు ఎవ‌రూ నిల‌బ‌డ‌రు. నాలుగు త‌న్నితే చ‌చ్చి ఊరుకునే విలన్లే ఎక్కువ‌.

అందువ‌ల్ల చూసే ఆడియెన్ కి కూడా ఏమాత్రం కిక్కు ఉండ‌డం లేదు. హీరోని అయినా గ‌ట్టిగా దెబ్బ కొట్టే కాంప్లికేటెడ్ విల‌న్లు ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం కూడా సినిమా రిజ‌ల్ట్ పై ప్ర‌భావం చూపిస్తోందంటే అతిశ‌యోక్తి కాదేమో!

అందుకేనేమో మోగాస్టార్ చిరంజీవి త‌న పాత్ర‌కు ధీటుగా ఉండే విల‌న్ ని వెత‌క‌మ‌న్నార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి తమిళ హిట్ చిత్రం వేదాలం రీమేక్ చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయాల్సి ఉన్నా కానీ చిరు ఖాతాలో ప‌డింది చివ‌రికి. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అతను ఈ చిత్రం కాస్టింగ్ ఎంపిక లో బిజీగా ఉన్నాడు మెహ‌ర్. కీర్తి సురేష్ ని ఇప్ప‌టికే నాయిక‌గా ఫైన‌ల్ చేశారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం...ఇందులో ఇప్ప‌టికే తెలుగు ఆడియెన్ కి తెలిసిన కొంద‌రు ఆర్టిస్టులు భాగం కావాలని చిరు కోరుకుంటున్నారట‌. ముఖ్యంగా ప్రముఖ హిందీ హీరో ప్రధాన విలన్ పాత్రలో నటించాలని చిరంజీవి కోరుకుంటున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. మెహర్ రమేష్ తన సినిమాల్లో ఎప్పుడూ నెగెటివ్ రోల్స్ కి కూడా ప్రాధాన్య‌త‌నిచ్చారు. అందుకే విల‌న్ పాత్రను చేయడానికి చిరుతో సమానంగా ఉన్న నటుడి కోసం వెతుకుతున్నార‌ట‌. ఒకరిని కాదు.. ప‌లువురు విల‌న్ల‌తో మాట్లాడే ప‌నిలో మెహ‌ర్ ఉన్నార‌ట‌. ఈ చిత్రంలో చిరును ధీటుగా ఎదుర్కొనే విల‌న్ ఎవ‌రు? అన్న‌దానికి ఇంకా స‌మాధానం రావాల్సి ఉంది.