Begin typing your search above and press return to search.
'డేంజరస్' హీరోయిన్ కు కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 10 Aug 2020 11:50 AM GMTగత నెల రోజులుగా బాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు మరియు సినీ ప్రముఖులు కరోనా నుండి సేఫ్ గా ఉంటున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదు అనుకుంటున్న సమయంలో వరుసగా వారు కరోనా బారిన పడటంతో పాటు ఒక్కరు ఇద్దరు మృతి కూడా చెందడంతో ఆందోళన ఎక్కువ అవుతోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ ఫ్యామిలీ కరోనా సోకి వారంతా ఇప్పుడు కరోనాను జయించారు. ఇదే క్రమంలో మరికొందరు కూడా కరోనా బారిన పడుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ నటాషా సూరికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట. ఆ విషయాన్ని స్వయంగా ఆమె వెళ్లడి చేసింది. ముఖ్యమైన పని ఒకటి ఉండి ఇటీవలే పూణె వెళ్లి వచ్చాను. వచ్చిన రెండు మూడు రోజులకు జ్వరం వచ్చింది. అనుమానం వచ్చి పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప జ్వరం మరియు నీరసం ఉన్నట్లుగా ఆమె పేర్కొంది.
నా కుటుంబ సభ్యులకు కూడా నేను పరీక్షలు చేయించాను. ప్రస్తుతం వైధ్యుల సూచన మేరకు డైట్ ఫాలో అవుతూ మెడిసిన్స్ తీసుకుంటూ స్వీయ నిర్భందంలో ఉంటున్నాను. ఇంట్లోనే ఉండి తాను కరోనాను జయిస్తాను అనే నమ్మకంను ఆమె వ్యక్తం చేస్తోంది. ఇమ్యూనిటీ బ్యూస్టర్స్‌ను తాను తీసుకుంటున్నట్లుగా ఆమె పేర్కొంది. ఇటీవలే ఈమె బాలీవుడ్ లో డేంజరస్ అనే చిత్రంలో నటించింది. బిపాస బసు మరియు కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలో నటించిన డేంజరస్ చిత్రంలో ఈమె కూడా నటించింది. ఆగస్టు 14వ తారీకున ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. కరోనా పాజిటివ్ అంటూ నటాషాకు కన్ఫర్మ్ అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కోరుకుంటున్నారు.