Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో చిట్టి గువ్వ‌లు

By:  Tupaki Desk   |   12 Dec 2018 4:43 PM GMT
అంబానీ పెళ్లిలో చిట్టి గువ్వ‌లు
X
అంబానీల ఇంట పెళ్లి అంటే మజాకానా? ఆకాశం కిందికి దిగి రావాలి. చుక్క‌లు త‌లంబ్రాలుగా మారాలి. చంద‌మామ అక్షింత‌లు చ‌ల్లి ఆశీర్వ‌దించాలి. లేదంటే అంబానీకి కోపం వ‌చ్చేస్తుంది. అస‌లే గారాల ప‌ట్టీ ఇషా పెళ్లి వేడుక‌. అందుకే ఏకంగా ముంబై నుంచి కొన్ని చిట్టి గువ్వ‌లు - అందాల రామ‌చిలుక‌లు ఎగురుకుంటూ ఉద‌య్‌ పూర్ వెళ్లాయి.

అలా వెళ్లిన వాళ్ల‌లో టాలీవుడ్ నుంచి త‌మ‌న్నా, కియ‌రా అద్వాణీ ఉన్నారు. వీళ్ల‌తో పాటే అక్క‌డ మెరుపులు మెరిపించ‌డంలో క‌పూర్ సిస్ట‌ర్స్ జాన్వీ- ఖుషీ పోటీప‌డ్డారు. అంతేకాదు.. న‌వ‌త‌రంలో స్పీడున్న క‌థానాయిక ఆలియా బూరెబుగ్గ‌ల్లో చిల్లులు ఆవిష్క‌రిస్తూ పెళ్లి అంత‌టా క‌లియ‌తిరిగింది. వీళ్ల‌తో పాటే సీనియ‌ర్ నాయిక‌లు కంగ‌న ర‌నౌత్ - శిల్పాశెట్టి - గౌరీఖాన్ - ఐశ్వ‌ర్యారాయ్ అక్క‌డ క‌నిపించారు.

ఇట‌లీ లేక్ కోమోలో నిశ్చితార్థ వేడుక మొద‌లు - నిన్న ఉద‌య్ పూర్‌ లో ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ వ‌ర‌కూ ఓ ఎత్తు అనుకుంటే ఇక పెళ్లి వేడుక‌ను ముంబైలోనే అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపిస్తున్నారు అంబానీలు. నేటి సాయంత్రం ఈ వేడుక ఘ‌నంగా జ‌రుగుతోంది. వేడుక ఆద్యంతం బాలీవుడ్ స్టార్లు స‌హా ఇండ‌స్ట్రీ బెస్ట్ సెల‌బ్రిటీలు అక్క‌డ వాలిపోవ‌డం తో సంద‌డి సంద‌డిగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా న‌వ‌త‌రం నాయిక‌లు ర‌క‌ర‌కాల డిజైన‌ర్ డ్రెస్‌ ల‌లో దిగిపోయి కిల్ చేస్తున్నారంతే. ఇషా అంబానీ- ఆనంద్ పెరుమాళ్ పెళ్లి ఇండియాలోనే కాస్ట్‌ లీయెస్ట్ మ్యారేజ్. ఈ వేడుక కోసం వంద‌ల‌కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు అంబానీ.