Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో పాతబడిపోతున్న సౌత్ తారలు.. కొత్తనీరులా బాలీవుడ్ గుమ్మలు!!

By:  Tupaki Desk   |   22 July 2020 3:30 AM GMT
ఇండస్ట్రీలో పాతబడిపోతున్న సౌత్ తారలు.. కొత్తనీరులా బాలీవుడ్ గుమ్మలు!!
X
ఇండస్ట్రీలో పాతనీరు పోయి కొత్తనీరు వస్తుంది అన్నట్లుగా రోజురోజుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లను పక్కకు నెట్టేసి కొత్త కొత్త బాలీవుడ్ అందాలన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే పలు బిగ్గీ ప్రాజెక్ట్స్ అన్నీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ రూపొందించే పాన్ ఇండియా మూవీస్ లో బాలీవుడ్ తారలే సెలెక్ట్ అవుతున్నారు. కాదు కాదు దర్శక నిర్మాతలు అటువైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం ఓ బాహుబలి, సైరా నరసింహరెడ్డి సినిమాల వరకే టాలీవుడ్ టాప్ హీరోయిన్లను తీసుకున్నారు.

కానీ ప్రభాస్ హీరోగా రూపొందిన 'సాహో' మూవీలో బాలీవుడ్ నుండి శ్రద్ధాకపూర్, ఆ తర్వాత రూపొందుతున్న 'రాధేశ్యామ్' సినిమాలో కూడా బాలీవుడ్ గుమ్మ పూజాహెగ్డే.. ఇక నెక్స్ట్ తెరకెక్కబోయే సైన్స్ ఫిక్షన్ మూవీలో కూడా బాలీవుడ్ నుండి దీపిక పదుకోనె సెలెక్ట్ అయింది. మరి ఎప్పటినుండో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా ఉన్న తమన్నా, కాజల్, అనుష్క.. ఇంకా కొందరు. అలాగే ఇప్పుడిప్పుడే స్టార్డం అందుకుంటున్న హీరోయిన్లు కొందరు ఉన్నారు. మరి వీళ్లంతా పాన్ ఇండియా సినిమాలలో కనిపించడానికి అర్హులు కాదా.. అని సినీవర్గాలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ పాన్ ఇండియా సినిమాలేమో బాలీవుడ్ తారలకు.. మీడియం, స్మాల్ మూవీస్ ఇక్కడి హీరోయిన్లకు అవకాశం ఇస్తున్నారు.

ఇప్పటికే రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో అలియా భట్, పూరీజగన్నాథ్ ఫైటర్ మూవీతో అనన్య పాండే, క్రిష్ 'విరూపాక్ష' మూవీతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, తాజాగా నాగ్ అశ్విన్ మూవీతో దీపిక పదుకోనెలు టాలీవుడ్లో వాళ్ల సత్తా చాటనున్నారు. మరి అక్కడి హీరోయిన్లు ఇక్కడ వచ్చి రచ్చ చేస్తుంటే ఇక్కడి హీరోయిన్లు మాత్రం ఇక్కడే ఉండిపోతున్నారు. అవకాశాలు రాకపోతే కెరీర్ ముగించేస్తున్నారు. సౌత్ హీరోయిన్స్ కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తేనే కెరీర్ సాఫీగా సాగుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఒకవిధంగా అది కూడా నిజమే.. ఇప్పుడు పూజాహెగ్డే, కియారా లాంటి వాళ్లు రెండు ఇండస్ట్రీలలో సత్తా చాటుతున్నారు. అలాగే ఇక్కడి వాళ్లు కూడా ట్రై చేస్తే ఏదైనా బాగుంటుందని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి సౌత్ హీరోయిన్స్ ఎవరైనా అక్కడ పాగా వేస్తారేమో..!