Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: పింక్ లో పంచదార చిలకలు
By: Tupaki Desk | 19 Feb 2020 4:30 AM GMTపార్టీల్లో పింక్ డ్రెస్ కి ఉండే ఇమేజ్ వేరు. అందుకే సెలబ్రిటీలు పింక్ ని ప్రిఫర్ చేస్తుంటారు. టాలీవుడ్ టు బాలీవుడ్ కథానాయికలకు పింక్ అబ్సెషన్ ఓ రేంజులో బయటపడింది. పార్టీలు.. ప్రెస్ మీట్లు.. ఈవెంట్లు ఎక్కడైనా పింక్ లో ప్రత్యేకంగా కనిపించేందుకు మన భామలు ఆసక్తిగా ఉంటారు. తెలుగు- ఎరుపు-నలుపు- పసుపు-బులుగు ఎన్ని రంగులున్నా పింక్ కి ఉండే ప్రత్యేకత వేరు మరి.
ఇదిగో టాప్ 5 బ్యూటీస్ పింక్ డ్రెస్ లో తళుకులు ప్రదర్శించిన ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అందాల కత్రినా కైఫ్ చాలా సందర్భాల్లో పింక్ లో కనిపించింది. మిస్ కైఫ్ ఏ డ్రెస్ లో అయినా అందంగా కనిపిస్తుంది. పింక్ లో ఇంకా హాట్ గా కనిపిస్తుంది. తాజాగా ఓ ఈవెంట్లో అనితా డోంగ్రే రూపొందించిన పింక్ డ్రెస్ తో కనిపించింది. విమానాశ్రయానికి వెళుతూ ఇలా కనిపించింది. కత్రిన చేతి భాగంలో ఎంబ్రాయిడరీతో డిజైన్ ఆకట్టుకుంది.
దీపికా పదుకొనేకి పింక్ అబ్సెషన్ చాలా సార్లు బయటపడింది. పింక్ దుస్తులపై దీపిక ప్రేమ అందరికీ తెలిసిందే. దీపిక గులాబీ రంగు డ్రెస్ లతో చాలాసార్లు వేదికలపై కనిపించింది. చీరలు సహా సల్వార్ సూట్లు.. గౌన్ల వరకు పింక్ నే ప్రిఫర్ చేస్తుంది. నిదురించేప్పుడు పింక్ దుస్తులను ధరిస్తుంది. పింక్ మామిడి మిక్స్ చేసిన పట్టు చీరతో ఇంతకుముందు కపిల్ శర్మ వివాహ రిసెప్షన్ కు దీపిక హాజరైంది. ఇంకా చాలాసార్లు పింక్ లో మైమరిపించింది.
ప్రియాంక చోప్రా జోనాస్.. పింక్ లుక్ లో చాలాసార్లు వేదికలపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిక్ తో కలిసి న్యూయార్క్ నగరంలో షికార్లు చేసేప్పుడు పింక్ డ్రెస్ లో పలుమార్లు దర్శనమిచ్చింది. పీసీ `ది స్కై ఈజ్ పింక్!` అనే చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే.
కరీనా కపూర్ ఖాన్.. గుడ్ న్యూజ్ ప్రచారంలో పింక్ తో ప్రత్యక్షమైంది. టాప్ టు బాటమ్ గులాబీ రంగు సిల్క్ బటన్ చొక్కాలు తొడుక్కుని కనిపించింది. పింక్ బ్యాగీ ప్యాంటుతోనూ కనిపించింది. యంగ్ బ్యూటీ తారా సుతారియా ఫ్యాషన్ విషయానికి వస్తే బ్లాక్ .. పింక్ రంగుల్ని ఇష్టపడుతుందిట. వివాహ వేడుకలకు హాజరు కావడానికి తారా సుతారియా రాణి పింక్ లెహెంగాను ఇష్టపడుతుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ .. ఫేవరెట్ కలర్ పింక్. ఇంతకుముందు తన కుమార్తె ఆరాధ్య పాఠశాల ఫంక్షన్ కోసం పింక్ దేశీ సూట్ ని ధరించింది. ఆ పార్టీలో అందరి కళ్ళు తనపైనే పడేలా చూసుకుంది.
సారా అలీ ఖాన్.. పింక్ లుక్ చాలాసార్లు కట్టిపడేసింది. డిజైనర్ ద్వయం అబూ జానీ - సందీప్ ఖోస్లా తన కోసం పింక్ కాంబినేషన్ నే డిజైన్ చేశారు చాలాసార్లు. రాణి పింక్ లెహెంగా భారీ ఎంబ్రాయిడరీతో బంగారు వర్ణం లెహెంగాలో కనిపించింది ఇదివరకూ. పలువురు బాలీవుడ్ నాయికలు పింక్ లో కనిపించి మైమరిపించిన సందర్భాలున్నాయి. ఇటు సౌత్ లోనూ నాయికలకు పింక్ ఫేవరెట్ కలర్ అనడంలో సందేమమేం లేదు.