Begin typing your search above and press return to search.

ఫెమినిస్టు గ్యాంగ్‌ అంతా ఏమైంది??

By:  Tupaki Desk   |   23 Jun 2016 3:30 PM GMT
ఫెమినిస్టు గ్యాంగ్‌ అంతా ఏమైంది??
X
దేశాన్ని కుదిపేసే రేప్ ఘటన అయినా.. లేదంటే ఎవరైనా ఒక న్యూస్ పేపర్ లో ఒక నటీమణి క్లీవేజ్ గురించి రాసినా.. ఎప్పుడు మనకు వినిపించే పేర్లు కొన్ని ఉన్నాయి. స్టార్ హీరోయిన్లు అయిన ఈ భామలు.. పక్కా ఫెమినిస్టు వాదుల్లా సదరు ఘటనలపై సోషల్ నెట్వర్క్ లపై తమ అభిప్రాయాలను వెళ్లగక్కుతూ.. నానా హంగామా చేస్తుంటారు. ఇప్పుడు సడన్ గా ఈ భామ ఆచూకి లభించట్లేదు.

నిజానికి హీరో సల్మాన్‌ ఖాన్‌ చేసింది ఒక దారుణమైన వ్యాఖ్య. సుల్తాన్‌ సినిమాకు కష్టపడటం అంటే.. రేప్ బాధితుల తరహాలో ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై ఒక 40 ఏళ్ళ సింగర్ స్పందిస్తే.. ఆంటీ అంటూ అందరూ ఆమెను ఎగతాళి చేశారు. దీనిపై చాలామంది నటీమణులను స్పందించమని అడిగితే.. నో కామెంట్‌ అంటున్నారు. కొందరేమో అసలు సల్మాన్‌ ఏమన్నాడో తెలియకుండా మేం స్పందించలేం అంటూ తెలివిగా సమాధానం దాటేస్తున్నారు. ఇక సొసైటీ కారణంగా డిప్రెషన్ లోకి వెళిపోయానంటూ అప్పట్లో కన్నీళ్ళు పెట్టుకున్న దీపికా పదుకొనె.. స్వలింగ సంపర్కుల కోసం గొంతెత్తి మాట్లాడిన సోనమ్ కపూర్.. చాలా ఆట్రోసిటీలపై స్పందించే అనుష్క శర్మ.. తదితర ఫెమినిస్టు గ్యాంగ్‌ అంతా ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ విషయంలో మాత్రం నోరు మెదిపితే ఒట్టు.

ఒకవేళ సల్మాన్‌ కు ఎదురెళితే.. సల్మాన్‌ సినిమాల్లోనే కాదు.. పక్క సినిమాల్లోనూ అవకాశాలు పోతాయనేది వీరి భావనేమో. ఇంత సెల్ఫిష్ గా ఉండే భామామణులు.. మరి సామాన్యుల విషయంలో మాత్రం నీతి నిజాయితీ సొసైటీ గాళ్‌ పవర్ అంటూ రచ్చ చేస్తారెందుకో!!