Begin typing your search above and press return to search.
ట్రాక్ తప్పిన బాలీవుడ్ హిట్ మిషన్..!
By: Tupaki Desk | 29 Oct 2022 8:30 AM GMTబాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా చాలా తక్కువ రోజుల్లో సినిమాలు పూర్తి చేసి.. లిమిటెడ్ బడ్జెట్ తో ప్రాజెక్ట్ లు చేసే హీరో మాత్రం అక్షయ్ కుమార్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఎంటర్టైనర్ గా బీ టౌన్ ఆడియన్స్ ని ఆయన దశాబ్ధాల కాలంగా మెప్పిస్తూ వస్తున్నారు.
ఒకానొక దశలో అక్షయ్ కుమార్ ఏ మూవీ చేసినా అది సూపర్ హిట్ అనే క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. అయితే కోవిడ్ ముందు వరకు పరిస్థితి ఇలానే ఉంది కానీ కరోనా తర్వాత సీన్ మారిపోయింది. అక్షయ్ కుమార్ ఈ రెండేళ్లలో చేసిన ఐదు సినిమాల్లో సూర్యవంశీ ఒక్కటి తప్ప మిగతా ప్రాజెక్టులు అన్ని బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి.
సౌత్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన బాలీవుడ్ ఆడియన్స్ అక్కడ హీరోల సినిమాలను లైట్ తీసుకున్నారు. ఇదే విషయంపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ సినిమా ఫ్లాప్ కి ప్రేక్షకులకు ఎలాంటి సంబంధం లేదని వారిని మెప్పించేలా తామే సినిమాలు చేయట్లేదని అన్నారు.
వారిని కనెక్ట్ చేయడంలో ఎక్కడో విఫలమవుతున్నామని అన్నారు. అలా అంటూనే ఆయన వరుస ఫ్లాపులు తీస్తున్నారు. ఈమధ్య కాలంలోనే అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే, బెల్ బాటం, పృధ్విరాజ్, రక్షా బంధన్ లేటెస్ట్ గా రామ్ సేతు సినిమాలతో ఫ్లాప్ అందుకున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ హిట్ మిషన్ అనుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పి వరుస ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నారు.
అక్షయ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నా సరే ఇప్పటికీ ఆయనకు సూపర్ ఆఫర్లు వస్తున్నాయి. కేవలం నాలుగు నెలల్లోనే సినిమా పూర్తి చేయడం అక్షయ్ కు అలవాటు.. ఓపెనింగ్ డే నుంచి రిలీజ్ డే వరకు సినిమా పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తారు.
అందుకే సినిమాలు పోతున్నా అక్షయ్ కి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మళ్లీ ఆయన మునుపటి ఫాం ని కొనసాగించాలని.. హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్ కి సూపర్ హిట్లు ఇచ్చేలా హిట్ మిషన్ లా మళ్లీ అక్షయ్ రెడీ అవ్వాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.