Begin typing your search above and press return to search.

మ‌రో పెద్ద సినిమా ఫేట్ ఎలా ఉందో కానీ!

By:  Tupaki Desk   |   1 Sep 2022 2:30 AM GMT
మ‌రో పెద్ద సినిమా ఫేట్ ఎలా ఉందో కానీ!
X
పాన్ ఇండియా మూవీ `బ్ర‌హ్మాస్త్ర` విడుదల కోసం ఇండస్ట్రీ స‌హా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రణబీర్ కపూర్ - అలియా భట్ నటించిన ఈ సూపర్ హీరో సాగా ఎలాంటి రిజ‌ల్ట్ ని అందుకోబోతోందో అంటూ ఉత్కంఠ క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ దూసుకెళ్లింది. సూపర్-హిట్ పాట కేసరియాను యూత్ కి క‌నెక్ట్ చేశారు. VFX- పౌరాణిక కనెక్షన్ కారణంగా ప్ర‌యోగాత్మ‌క ఎలిమెంట్ ప‌రంగా ఏం చేశారు? అన్న‌ది తెలుసుకోవాల‌ని అంతా ఉవ్విళ్లూరుతున్నారు. కార‌ణం ఏదైనా కానీ.. ఇది 2022లో అతిపెద్ద బాలీవుడ్ ఓపెనర్ గా అవతరిస్తుందా లేదా? అన్న‌దానిపై ట్రేడ్ అంచనా వేస్తోంది.

తాజా బ్రేకింగ్ ప్ర‌కారం ఇప్ప‌టికే అమెరికాలో `బ్రహ్మాస్త్ర` అడ్వాన్స్ బుకింగులు ప్రారంభమయ్యాయ‌ని స‌మాచారం. ఓవ‌ర్సీస్ లో షోల‌ ప్రదర్శనలు సెప్టెంబర్ 8 గురువారం సాయంత్రం 5:00 గంటల నుండి ప్రారంభమవుతాయని తెలిసింది. #బ్రహ్మాస్త్ర - మొదటి భాగం: శివ బ్రేకింగ్ బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్ USAలో ప్రారంభమవ్వ‌డంతో ట్రేడ్ నిపుణులు లెక్క‌లు క‌ట్టే ప‌నిలో ఉన్నారు. సెప్టెంబర్ 8 గురువారం సాయంత్రం 5.00 గంటల నుంచి అమెరికాలో పెయిడ్ ప్రివ్యూ షోలు ప్రారంభమవుతాయని తెలిసింది. నిన్న అంటే ఆగస్టు 29న USAలో బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ట్వంటీయ‌త్ సెంచరీ స్టూడియోస్ యూట్యూబ్ ఛానెల్ ఒక వీడియోను పోస్ట్ చేయ‌డంతో ఈ వివ‌రం వెల్ల‌డైంది. రణబీర్ కపూర్ దానిని ప్రకటించినట్లు వీడియోలో ఆవిష్క‌రించారు. ఊహించిన విధంగానే అభిమానులు ఈ పరిణామంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రముఖ టికెటింగ్ వెబ్‌సైట్ ఫాండాంగో లో టికెట్ సేల్ స్టార్ట‌య్యింది. బ్రహ్మాస్త్రా టికెట్ అమ్మకాలు అమెరికా వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ థియేటర్లలో హిందీ -తెలుగు వెర్షన్ ల కోసం సేల్ ప్రారంభించారు. IMAX స్క్రీన్‌లలో కూడా ఈ చిత్రానికి తగిన సంఖ్యలో షోలు ప‌డుతున్నాయి. దీంతోపాటు త్రీడీ షోల టిక్కెట్లు కూడా అమ్ముడుపోతున్నాయి.

ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే బ్రహ్మాస్త్రా సెప్టెంబర్ 9న విడుదల కానుండగా USAలో ఒక రోజు ముందే షోలు ప్రారంభం కానున్నాయి. ఈ పెయిడ్ ప్రివ్యూలకు మంచి స్పందన వస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. నిజానికి ఇది భారతదేశంలో కూడా ధర్మ ప్రొడక్షన్స్ - స్టార్ స్టూడియోల వివ‌రం ప్ర‌కారం.. సెప్టెంబర్ 8 సాయంత్రం నుండి చెల్లింపు ప్రివ్యూలను నిర్వహించవచ్చని కూడా ఫ్యాన్స్ లో ఆశలున్నాయి. దీనికి సంబంధించి కొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

ఎగ్జిబిట‌ర్ల వివ‌రాల ప్ర‌కారం.. భారతదేశంలో ముందస్తు బుకింగ్ సెప్టెంబర్ 2 శుక్రవారం నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇతర విదేశీ ప్రాంతాలలో టిక్కెట్ల విక్రయాలు కూడా అదే సమయంలో ప్రారంభమవుతాయి.

బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్ - నాగార్జున - మౌని రాయ్ కూడా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇది బ్ర‌హ్మాస్త్ర ఫ్రాంఛైజీలో మొదటి భాగం.. ఆస్ట్రావెర్స్ కు చెందిన మరిన్ని చిత్రాలను రూపొందించాలని తాము ఆశిస్తున్నట్లు మేకర్స్ ఇంత‌కుముందే వెల్లడించారు.

బాలీవుడ్ లో కొన్ని భారీ చిత్రాలు ఫ్లాపుల‌వ్వ‌డంతో బ్ర‌హ్మాస్త్ర రిజ‌ల్ట్ ఎలా ఉంటుందోనన్న టెన్ష‌న్ అంద‌రిలోనూ ఉంది. పృథ్వీరాజ్ సామ్రాట్- ర‌క్షాబంధ‌న్-లాల్ సింగ్ చ‌ద్దా-83- ర‌న్ వే 34 చిత్రాల ఫ‌లితం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ముఖ్యంగా ర‌ణ‌బీర్ - ఆలియా జంటకు ఇది ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం కావ‌డంతో ఎంతో శ్ర‌మించి ప్ర‌చారం కూడా చేసారు. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉండ‌నుందో వేచి చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.