Begin typing your search above and press return to search.
కరణ్ జోహార్ శిల్పంలా చెక్కుతున్నాడా?
By: Tupaki Desk | 15 Nov 2022 12:30 AM GMTబాలీవుడ్ హోస్ట్ సంచలనం..దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కొంత కాలంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. నిర్మాతగానే ఎక్కువగా సినిమాలు నిర్మిస్తున్నారు. మిగతా సమయంలో కాఫీ విత్ కరణ్ టాక్ షో సహా సెలబ్రిటీ ఈవెంట్లను కండెక్ట్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. గత ఏడేళ్ల కాలంగా కరణ్ ఇదే వృత్తిలో ఉన్నారు.
మరోవైపు అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్లతోనూ కరణ్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇందులో బిజీ అయి మెగా ఫోన్ పట్టడమే మర్చిపోయారు. దీంతో కరణ్ దారి తప్పుతున్నారా? అన్న సంకేతాలు సైతం బాలీవుడ్ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో 'రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' చిత్రంతో మళ్లీ దర్శకుడిగా కంబ్యాక్ అవుతున్నట్లు ప్రకటించారు.
రణవీర్ సింగ్..అలియాభట్ హీరో..హీరోయిన్లగా నటిస్తుండగా..సీనియర్ నటులు ధర్మేంద్ర..జయా బచ్చన్ ..షబానా అజ్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా మంచి ప్యాడింగ్ తో తెరకెక్కడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి. ఏడేళ్ల గ్యాప్ నేపథ్యంలో కరణ్ మేకింగ్ ఎలా ఉండబోతుంది అన్న ఉత్సాహం అభిమానుల్లో మొదలైంది.
ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తిచేసి ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే ఇప్పుడీ చిత్రాన్ని వాయిదా వేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ డిలేకి ప్రధాన కారణంగా కరణ్ అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
పోస్ట్ ప్రొడక్షన్ ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తవుతుందని సంబంధిత డిపార్ట్ మెంట్ సూచించిందిట. కానీ కరణ్ పర్పెక్షన్ కోసం..రివ్యూ కోసం ఎక్కువ సమయం తీసుకుని చేయాలని నిర్ణయించడంతో..ఆయన కోరిక మేరకే వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఏడేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టి చేస్తోన్న చిత్రం కావడంతోనే మరింత కేరింగ్ తీసుకుని ష్యూర్ షాట్ కొట్టాలన్న టార్గెట్ తోనే కరణ్ చిత్రాన్ని శిల్పంలా చెక్కుతున్నట్లు యూనిట్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ఈ రకమైన ఆలోచన మంచిదే. సమయం చేతిలో ఉంటే తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సినిమా రిలీజ్ కానంత కాలమే ప్రొడక్ట్ ని ఏ విధంగానైనా మార్పులు చేయగలం. జనాల్లోకి వెళ్లిన తర్వాత ఆ బాధ్యత వాళ్లదే అవుతుంది. అందుకే కరణ్ ముందు జాగ్రత్తగా అలెర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.