Begin typing your search above and press return to search.

టైటిల్ కోసం కొట్టుకుంటున్నారు

By:  Tupaki Desk   |   2 March 2019 11:45 AM GMT
టైటిల్ కోసం కొట్టుకుంటున్నారు
X
అసలే బయోపిక్ ల సీజన్. అందులోనూ బాలీవుడ్ లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీస్తున్న మూవీస్ కి ఆదరణ భారీగా ఉంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన యుఆర్ ఐ ది సర్జికల్ స్ట్రైక్స్ ని మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. చిన్న సినిమాగా విడుదలై ఏకంగా 228 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించుకుంది. ఇప్పుడు దర్శక నిర్మాతలకు మరో హాట్ టాపిక్ దొరికింది. అదే అభినందన్. పాకిస్థాన్ చెరనుంచి సురక్షితం గా బయటపడి నిన్న గర్వంగా కోట్లాది అభిమానుల ఆశీస్సులతో మన గడ్డ మీద అడుగుపెట్టిన ఈ యుద్ధ వీరుడి కథను సినిమాగా తీయడానికి అప్పుడే అగ్ర సంస్థల మధ్య పోటీ మొదలైందని సమాచారం .

పుల్వామా దాడులు మొదలుకుని నిన్న అభినందన్ తిరిగి రావడం వరకు భారీ బడ్జెట్ తో తెరకేక్కించేందుకు అప్పుడే ప్రయత్నాలు షురు అయ్యాయి. ఇదిలా ఉంచితే కథ కన్నా ముందు టైటిల్ దక్కించుకోవడం ముఖ్యం కాబట్టి ఆ రకంగా అప్పుడే లాబీయింగ్ కూడా మొదలయినట్టు సమాచారం

గత నెల 26వ తేది వెస్ట్ ముంబైలో ఉన్న ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కార్యాలయం కిటకిటలాడింది. కారణం టైటిల్స్ రిజిస్ట్రేషన్. పుల్వామా-బాల్కొట్-అభినందన్-మిషన్ పుల్వామా ఇలా ఈ పేర్ల కోసం ఒకటి కాదు ఏకంగా ఐదు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ పోటీ పడుతున్నాయట. చిన్నా చితక నిర్మాతలు పదుల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. ఆ రోజు కౌన్సిల్ ఆఫీస్ ఓ మార్కెట్ ని తలపించిందని అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి కథనం.

నామ మాత్రం రుసుముతో టైటిల్ రిజిస్టర్ చేసుకునే సౌలభ్యం ఉండటంతో అందరూ ఇలా ఎగబడుతున్నారు. ఎక్కువగా డిమాండ్ ఉన్నవి మాత్రం పుల్వామా-కమాండర్ అభినందన్ అని టాక్. దరఖాస్తులన్నీ వడబోత పోసి ఓ నిర్ణయం తీసుకోవాలని అసోసియేషన్ పెద్దలు డిసైడ్ చేసారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే