Begin typing your search above and press return to search.

ఇంత గ్యాప్ త‌ర్వాత ఎందుకింత సౌండ్?

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:30 PM GMT
ఇంత గ్యాప్ త‌ర్వాత ఎందుకింత సౌండ్?
X
''ఊరక రారు మహాత్ములు''.. మంచి ఉద్దేశ్యం తో చెప్పిన భాగవత పద్యమిది. అంటే గొప్ప వాళ్ళు వచ్చి శుభమును చేకూరుస్తారు అని అర్థము.

ఊరక రారు మహాత్ములు..వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం గారణము మంగళములకు..నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా!.. ఈ ప‌ద్యంలోని లైన్లు శ్రీమదాంధ్రమహాభాగవతము నుంచి తీసుకున్న‌వే. ఇప్పుడు ఇలాంటి సంద‌ర్భం అతికిన‌ట్టు స‌రిపోతుందో లేదో కానీ.. పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా పేరు మార్మోగుతోంది.

గ్లోబ‌ల్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రియాంక చోప్రా అమెరిక‌న్ న‌టుడు కం గాయ‌కుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అక్క‌డే సెటిలైన సంగ‌తి తెలిసిందే. ఉన్న‌ట్టుండి ఇండియాలో దిగుతోంది పీసీ అన‌గానే అంద‌రికీ చెమ‌ట‌లు ప‌ట్టేశాయ్. ఇక భార‌త దేశంలో అందునా హిందీ చిత్ర‌సీమ‌లో బోలెడంత హంగామా చేసేస్తుంద‌నే అంతా భావించారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత పీసీ వ‌స్తుండ‌డంతో ఫ్యాన్స్ లో ఇది చ‌ర్చ‌గా మారింది.

అయితే ఇంత గ్యాప్ త‌ర్వాత ఆవిడ ఇక్క‌డ ఏం సాధించాల‌ని అనుకుంటోంది? అంటూ ఒక సెక్ష‌న్ ఆరాలు మొద‌లు పెట్టింది. ఏవో త‌న క‌మిట్ మెంట్లు ఉన్న‌వి పూర్తి చేసుకుని వెళుతుందిలే అనుకుంటే అలాంటి వేవీ లేవ్ ఇక్క‌డ‌. పెండింగ్ సినిమాల‌ను పూర్తి చేయ‌డానికి కూడా ఏవీ లేవు. క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇక్క‌డేవీ చేయ‌డం లేదు. ప్ర‌స్తుతం త‌ను హాలీవుడ్ లో న‌టిస్తోంది. కానీ అక్క‌డ కెరీర్ కూడా అంతంత మాత్ర‌మే. మూడేళ్లుగా అమెరికాలోనే సెటిల‌వ్వ‌డంతో బాలీవుడ్ కెరీర్ కూడా పూర్తిగా మంద‌గించింది. పీసీని పిలిచి అవ‌కాశాలిచ్చేందుకు ఎవ‌రూ లేరిక్క‌డ‌.

పైగా స‌ల్మాన్ ఖాన్ మూవీలో ఆఫ‌ర్ ని కాద‌నుకుని మ‌రీ పీసీ అప్ప‌ట్లో పెళ‌లి పేరుతో బాలీవుడ్ ని వ‌దిలేయ‌డంతో ఆ కోపం ఖాన్ లో ఇంకా అలానే ఉంద‌ని కూడా ప్ర‌చార‌మైంది. గ్లోబల్ స్టార్ అన్న పేరే పీసీకి ఉంది. కానీ పేరు గొప్ప ఊరు డ్యాష్ డ్యాష్‌! అన్న చందంగా సినిమా ఛాన్సులైతే లేవ్! అయితే ఎందుక‌ని ముంబైలో ఇంత‌గా సంద‌డి చేస్తోంది? అంటే... దాదాపు మూడేళ్ల త‌ర్వాత త‌న కిడ్ మాల్టీ మేరీతో క‌లిసి ఇండియా వ‌స్తోంది. త‌న ఫ్యామిలీ లైఫ్ ఏ ఇత‌ర స్టార్ హీరోయిన్ తో పోల్చినా బెట‌ర్ గా ఉంద‌ని నిరూపించేందుకు ఇలా చేస్తోంది! అన్న గుస‌గుస వినిపిస్తోంది.

నిక్ జోనాస్ ని పెళ్లాడి సంతోషంగా ఉన్న పీసీపై ఇటీవ‌ల ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు కూడా వినిపించాయి. ఆ ఇద్ద‌రికీ చెడింద‌ని అమెరికాలోని ప‌లు ప‌త్రిక‌ల్లో వార్త‌లు రావ‌డం కూడా అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. కానీ అలాంటి క‌ల‌త‌లేవీ లేవ‌ని అంతా స‌జావుగానే సాగుతోంద‌ని పీసీ ప్రాక్టిక‌ల్ గా నిరూపించింది. నిక్ తో త‌న అన్యోన్యత బాంధ‌వ్యం ఎక్క‌డా చెక్కు చెద‌ర‌లేద‌ని కూడా ప్రూవైంది.

అయితే ఇప్పుడు త‌న‌కు హిందీలో అవ‌కాశాలు రావ‌డం అన్న‌దే పాయింట్. అస‌లే పెళ్ల‌యి పిల్ల‌ల ఆల‌నాపాల‌నా చూస్తున్న పీసీ త‌న‌పై తాను శ్ర‌ద్ధ పెట్టేంత టైమ్ లేని ప‌రిస్థితిలో ఉంది. దీనివ‌ల్ల రూపం ప‌రంగానూ షేప‌వుట్ అయ్యింది. క‌రీనా క‌పూర్ రేంజులో చాలా వ‌ర్క‌వుట్లు చేస్తే కానీ తిరిగి త‌న పాత రూపానికి మార‌లేదు. ఇక ఇక్క‌డికి రాగానే అమెరికాలో త‌న రెస్టారెంట్ వ్యాపారం గురించి త‌న బ్రాండ్స్ గురించి ప్ర‌చారం చేసుకునేందుకు పీసీకి అవ‌కాశం ఉంది. అంత‌కుమించి ఒరిగిందేమీ లేదు మ‌రి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.