Begin typing your search above and press return to search.
స్టార్ ప్రొడ్యూసర్ ని కలవరపెడుతున్న బాలీవుడ్!
By: Tupaki Desk | 16 July 2022 11:30 AM GMTప్రస్తుతం దేశ వ్యాప్తంగా దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. ఇక్కడి సినిమాలకు ఉత్తరాది వారు కూడా ఫిదా అవుతున్నారు. నచ్చిన సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన పలువురు స్టార్ ప్రొడ్యూసర్ లు ఉత్తరాదిలో రాణించాలని ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. అక్కడ డబ్బింగ్ సినిమాలతో కాకుండా స్ట్రెయిట్ హిందీ మూవీస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్దగా రాణించలేకపోతున్నారు.
'గజిని' మూవీతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని సొతం చేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఇటీవల అల్లు ఎంటర్ టైన్ మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లపై దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ తో కలిసి తెలుగు హిట్ 'జెర్సీ'ని రీమేక్ చేశారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం 27 కోట్ల ని మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు ఈ మూవీ భారీ ఝలక్ నిచ్చింది. ఇక్కడితో ఆగని దిల్ రాజు టి సిరీస్ అధినేతలు భూషన్ కుమార్, కృష్ణకుమార్ లతో కలిసి మరో రీమేక్ ని నిర్మించారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ 'హిట్ :ది ఫస్ట్ కేస్' మ ఊవీని హిందీలో ఇదే పేరుతో రీమేక్ చేశారు. రాజ్ కుమార్ రావు, సాన్యా మల్హోత్రా జంటగా నటించారు. సైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 15న విడుదలైంది.
ఇది కూడా 'జెర్సీ' తరహాలోనే ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది. బిలో యావరేజ్ కేటగిరి చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీకి భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మిస్తే షాకింగ్ కలెక్షన్ లని తొలి రోజు రాబట్టి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మొదటి రోజు రూ. కోటి వసూలు చేసి షాకివ్వడంతో ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారట.
బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు ఇది రెండవ పరాజయం. ఇలా వరుసగా రెండు రీమేక్ లు ఫ్లాప్ లుగా మారి భారీ స్థాయిలో నష్టాలని అందించడంతో దిల్ రాజుని ప్రారంభంలోనే బాలీవుడ్ కవరానికి గురిచేస్తందంటూ ఇండస్ట్రీలో సెటైర్లు వినిపిస్తున్నాయట.
ఇదిలా వుంటే దిల్ రాజు మరో రీమేక్ ని బాలీవుడ్ లో చేయడానికి సిద్ధపడుతున్నారు. అల్లరి నరేష్ నటించిన 'నాంది' హిందీ రీమేక్ హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇదేనా దిల్ రాజుని అక్కడ నిలబెడుతుందో పడగొడుతుందో చూడాలి.