Begin typing your search above and press return to search.
WWE ఆటగాడితో కిలాడీ సవాల్.. బీమా చెక్ చేయాలట!!
By: Tupaki Desk | 22 Jun 2021 1:30 AM GMTబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ వారం ప్రారంభంలో తన `ఖిలాడియో కా ఖిలాడి` చిత్రం 25 సంవత్సరాల సెలబ్రేషన్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుర్తుగా అక్షయ్ ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. ది అండర్ టేకర్ (ఆటగాడి)ని ఓడించిన వారిలో నేను ఉన్నాను! అంటూ ఒక ఫోటోని షేర్ చేశారు. ఆ బాలీవుడ్ సినిమాలో అక్షయ్ పై డెడ్ మన్ (మార్క్ కాలవే కాదు) పోరాడారు.
ఈ పోస్ట్ వైరల్ అయ్యి చివరికి ఒరిజినల్ అండర్ టేకర్ వద్దకు చేరింది. అతడు తిరిగి అక్షయ్ ను పోటీకి దిగాల్సిందిగా సవాలు చేశారు. అక్షయ్ పోస్ట్ గురించి స్పందిస్తూ ది అండర్ టేకర్ ఇలా వ్రాశాడు.. మీరు రియల్ రీమ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పండి అని అన్నాడు. దానికి అక్షయ్ స్పందిస్తూ.. నా భీమాను తనిఖీ చేసి తిరిగి వస్తాను బ్రో! అని వ్యాఖ్యానించారు.
అక్షయ్ తన సినిమాలో బ్రియాన్ లీతో పోరాడాడు. బ్రియాన్ కొంతకాలం WWE లో ది అండర్ టేకర్ నకిలీ పాత్రను పోషించాడనేది చాలామందికి తెలియదు. నిజానికి ది అండర్ టేకర్ అసలు పేరు మార్క్ కాలవే. WWE సూపర్ స్టార్లలో ఎక్కువ కాలం పనిచేసిన వీరుడు. అతను నవంబర్ 1990 లో WWE లో అడుగుపెట్టాడు అప్పటి నుండి విన్స్ మక్ మహోన్ కోసం పనిచేస్తున్నాడు. అతను ఇంకా కంపెనీతో కలిసి ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. అక్షయ్ డూప్ తో పోరాడాడు కానీ ఒరిజినల్ తో అయితే కచ్ఛితంగా బీమాను చెక్ చేయించాలి.