Begin typing your search above and press return to search.
నటుడి పాత్రలో నటి..ఇదెలా సాధ్యం!
By: Tupaki Desk | 22 Dec 2022 1:30 AM GMTనటుడి పాత్రలో నటి ప్రవేశించిడం సాధ్యమేనా? మేల్ కోసం రాసి పాత్రలో ఫీమేల్ నటి వస్తే ఆ పాత్ర పరిపూర్ణమేనా? అంతటి సమర్ధులు మన పరిశ్రమల్లో ఉన్నారా? అంటే అవుననే అంటున్నాడు ఓ దర్శకుడు. బాలీవుడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ తనయుడు ఆస్మాన్ భరద్వాజ్ `కుత్తే` అనే థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నసీరుద్దీన్ షా...అర్జున్ కపూర్ ..కొంకణ్ సేన్..రాధికా మదన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే ఈసినిమాలో ఓ బలమైన మేల్ పాత్ర ఒకటుందిట. ఆపాత్రని ఎంతో ప్రత్యేకంగా దర్శకుడు రాసాడుట. ఓ పేరున్న నటుడు పోషిస్తే పాత్ర హైలైట్ అవుతుందని ఆ దిశగా ప్రయత్నాలు చేసారుట. కానీ దర్శకుడికి అలాంటి నటుడు ఎవరూ తారస పడకపోవడంతో ఆ బాధ్యతలు టుబుకి అప్పగించినట్లు తెలుస్తోంది.
ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని టుబ్ రివీల్ చేయడంతోనే విషయం బయటకు వచ్చింది. విశాల్ సర్ గత సినిమాలకంటే భిన్నమైసన సినిమా కుత్తే. ఆస్మాన్ చాలా కొత్తగా కథని సిద్దం చేసారు. ఇలాంటి పాత్ర పోషించడం తొలిసారి. వాస్తవానికి ఈ పాత్రను మగ నటుడి కోసం రాసారు. కానీ అందులోకి నేను వచ్చాను. నేను ఎలా వచ్చాను అన్నది ఇప్పటికి నాకు బ్లాక్ గానే అనిపిస్తుంది.
కానీ ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా..ఛాలెంజింగ్ గా ఉంటుంది. చాలా కొత్తగానూ కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా పుడతాయి. వాటిలో నటించాలంటే లక్ కూడా కలిసి రావాలి. అది నాకు ఈ సినిమా ద్వారా కలిసొచ్చింది అనిపించింది` అని తెలిపింది.
అయితే ఈ పాత్రలోకి టబు వచ్చే సరికి కొన్నిరకాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టబు లేటు వయసులో యువ నాయికలో చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హాట్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ సెగలు పుట్టిస్తుంది. మరి తాజా పాత్రతో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.