Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: స్వరమాంత్రికుడు A.R. రెహమాన్ పై బాలీవుడ్ మాఫియా కుట్ర?
By: Tupaki Desk | 11 April 2021 4:30 PM GMTప్రతిష్ఠాత్మక ఆస్కార్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగీత స్వరకర్త A.R. రెహ్మాన్ నిస్సందేహంగా ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన సంగీతకారులలో ఒకరు. భారతదేశంలో అన్ని ప్రధాన భాషా చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. అయితే ఇటీవలి A.R. రెహమాన్ హిందీ చిత్ర పరిశ్రమలో తక్కువ పని చేస్తున్నారు. దానికి కారణం ఏమిటి? అన్నది ఆరా తీస్తే ఎ.ఆర్. రెహమాన్ దాని వెనక అసలు కథను వెల్లడించారు. పరిశ్రమలో తన గురించి ఉన్న అపోహల గురించి రెహ్మాన్ ఓపెనయ్యారు. ఇందులో కుట్రల గురించి అస్పష్ఠంగా ప్రస్థావించడం అభిమానులలో చర్చకు వచ్చింది.
``నేను ఇంతియాజ్ అలీ సినిమాలు చేస్తున్నాను. తమషా వరకూ హిందీలో నేను సినిమాలు చేశాను. తరువాత నేను ఈ రెండు సినిమాల నిర్మాణం ప్రారంభించాను. కాబట్టి అతను తన సినిమాలను నిర్మించి తనదైన పనిని చేయబోతున్నాడని ప్రజలు భావించారు. అది ఒక తరహా అపోహ అయి ఉండవచ్చు. ఓ! అతను హాలీవుడ్ లో ఉన్నాడు. అన్నిచోట్లా చాలా చాలా చేస్తున్నాడని అనుకుంటారు. అదీ ఒక అపోహ``
``మరొక దురభిప్రాయం ఏమిటంటే.. మనకు అతని అవసరం లేదు. మాకు మరో ఐదుగురు స్వరకర్తలు ఉన్నారు. మేమే ప్రతిదీ చేసుకోగలం అని భావిస్తారు. పెద్ద సంగీత సంస్థలు ఇప్పుడు ఆ పని చేస్తున్నాయి. వారు నాగురించి ఎవరితో అయినా ప్రస్తావిస్తే .. ఎ.ఆర్. రెహమాన్ లేరు.. కాదు కాదు అతను ఇప్పుడు హాలీవుడ్ లో లేడు. ఈ ఐదు స్వరకర్తలను తీసుకోండి. నాకు ఈ ఐదు హిట్ ట్యూన్లు ఇచ్చారు అని మాట్లాడుతారు``
``నేను మీకు ఒక ప్యాకేజీ ఇవ్వగలను. సినిమాలకు కూడా ఫైనాన్స్ చేయగలను`` అని అడ్డు పడతారట. ఇవి పుకార్లు కావచ్చు కానీ నేను ఇంకా చాలా వెర్రి విషయాలు విన్నాను. ఇప్పుడే ఎందుకు చెబుతున్నాను అంటే.. కొన్నిసార్లు మనం మన వద్ద ఉన్నదాన్ని వ్యక్తపరచవలసి ఉంటుందని నేను భావించాను. ప్రతికూల మార్గంలో ఏమీ లేదు. కొన్నిసార్లు మనమందరం మన విభిన్న ప్రపంచాలలో ఉన్నాం. కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ప్రజలు తెలుసుకోవాలి. నేను వారితో నిలబడతాను. సంగీతం ఇస్తానని వాగ్దానం ఎప్పుడూ ఉంటుంది`` అన్నారు.
ఎ.ఆర్.రహ్మాన్ `99 సాంగ్స్` విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రంతో రచయిత నిర్మాతగా రెహమాన్ తొలిసారిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 16 న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం టీవీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ కార్యక్రమంలోనూ రెహమాన్ తన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. తన టీమ్ తో ఉన్న ఓ ఫోటోని రెహమాన్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.