Begin typing your search above and press return to search.
నిర్మాత దిల్ రాజుకు షాకిచ్చిన బాలీవుడ్ మోడల్.. కోర్టులో పరువునష్టం దావా!
By: Tupaki Desk | 3 March 2021 1:30 PM GMTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు షాక్ ఇచ్చింది బాలీవుడ్ మోడల్, యాక్ట్రెస్ సాక్షి మాలిక్. ఏకంగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై సాక్షి బాంబే హైకోర్టులో పరువునష్టం దావా వేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో పలు చర్చలకు దారితీస్తోంది. మరి ఇంతకీ దిల్ రాజు ఏం చేసాడు.. అతనిపై బాంబే హైకోర్టు వరకు ఎలా వెళ్ళింది.. అసలు సాక్షితో దిల్ రాజు వ్యవహారం ఏంటి..? అనంటే.. దిల్ రాజు గతేడాది నాని హీరోగా నిర్మించిన 'వి' సినిమాలో అనుమతి లేకుండా తన ఫోటో ఉపయోగించారని సాక్షి కోర్టులో పరువునష్టం దావా వేసింది. వి సినిమా గతేడాది సెప్టెంబర్ నెల లాక్డౌన్ సమయంలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఆ సినిమాలో మొబైల్ ఫోన్‌లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటో చూపించే సన్నివేశంలో తన ఫోటో వాడారని సాక్షి కోర్టుకెక్కింది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'సోను కి టిటు కి స్వీటీ' సినిమాలో 'బామ్ డిగ్గి డిగ్గి' అనే పాటతో మంచి క్రేజ్ తెచ్చుకుంది సాక్షి. అలాగే మోడల్ గా ఇంస్టాగ్రామ్ లో అరవై లక్షలకు పైగా ఫాలోయింగ్ కలిగిఉంది సాక్షి. అలాంటి మోడల్ ఫోటోను అభ్యంతర కరమైన సన్నివేశాలలో ఆమె పర్మిషన్ లేకుండా ఉపయోగించడం తప్పని కోర్టు తేల్చిచెప్పింది. అలాగే తక్షణమే వి సినిమాను ఓటిటి నుండి తొలగించాలని ఓటిటి వారిని ఆదేశించింది. ఆమె చెప్పిన సన్నివేశం తొలగించాక.. సాక్షికి, ఆమె న్యాయవాదికి సినిమా చూపించిన తర్వాత మళ్లీ సినిమాను ఆయా ఓటిటిలో ప్రదర్శించవచ్చని కోర్టు సెలవిచ్చింది. ప్రస్తుతం అమెజాన్ నుండి వి మూవీ తొలగించారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది.