Begin typing your search above and press return to search.

కామెంట్: బాలీవుడ్డోళ్ళకి మైండ్ బ్లాంకే

By:  Tupaki Desk   |   29 Nov 2017 6:39 PM GMT
కామెంట్: బాలీవుడ్డోళ్ళకి మైండ్ బ్లాంకే
X
దేశ సినీ పరిశ్రమకు తామే మూలం.. కేంద్రం.. ఆకర్షణ.. శక్తి.. అనుకుంటూ ఉంటారు బాలీవుడ్ జనాలు. సినిమా ఫీల్డ్ లో కూడా ఈ ఫీలింగ్ ఉంది లెండి. అందుకే బాలీవుడ్ అంటే పడి చస్తూ ఉంటారు.. అవకాశాల కోసం పాకులాడుతుంటారు.

కానీ బాహుబలి వచ్చిన తర్వాత లెక్కలు మారిపోయాయి. బాహుబలి మొదటి భాగంతో సంచలనం సృష్టిస్తే.. సెకండ్ పార్ట్ అయితే చరిత్ర సృష్టించేసింది. ఆమిర్ దంగల్ దున్నేసిందని ఎన్ని మాటలు చెప్పుకున్నా.. ఇండియాలో వసూళ్ల విషయంలో బాహుబలి2కి దంగల్ కు హస్తిమశకాంతరం ఉంటుంది. సౌత్ సినిమా పవర్ చాటి.. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఓ సినిమా కోసం వెయిట్ చేయించడంలో సక్సెస్ అయ్యాడు జక్కన్న. అలా బాహుబలి.. ఇచ్చిన పంచ్ నుండి ఇంకా బాలీవుడ్ తేరుకోలేదు. అందుకే ఆ సినిమా వచ్చాక ఆరు నెలల పాటు కనీస మాత్రం హిట్ కూడా లేదు.

జుడ్వా2 సక్సెస్ సాధించినా.. అది ఫక్తు కమర్షియల్ సినిమానే. ఇప్పుడు రాబోతోన్న వాటిలో కూడా అధిక భాగం అవే. ఇప్పుడు మళ్లీ సౌత్ నుంచి రోబో సీక్వెల్ రూపంలో 2.ఓ.. జయం రవి హీరోగా నటించిన టిక్ టిక్ టిక్.. వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్ మాత్రం ఇంకా కమర్షియల్ మసాలా హీరోయిజం.. లేదంటే రొమాంటిక్ డ్రామా.. అంటూ కాలం గడిపేస్తోంది.

కొత్త తరం సినిమాలు తీయడంలో సౌత్ ఫిలిం మేకర్స్ నాలుగడుగులు ముందే ఉంటున్నారు. కానీ బాలీవుడ్ మాత్రం కథలు దొరక్క.. బయోపిక్ లను తీసుకుంటున్నారు. లేకపోతే కమర్షియల్ మూవీస్.. లవ్ స్టోరీస్ తోనే కాలం గడిపేస్తున్నారు. ల్యాండ్ మార్క్ మూవీ అనదగ్గ స్థాయిలో ఒక ప్రాజెక్ట్ కూడా సెట్స్ పై లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. సరిగ్గా ఇదంతా ఆలోచిస్తే వారిక్కూడా మైండ్ బ్లాంక్ అయిపోతోందట.