Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: బాలీవుడ్ కి ఎన్ని చీవాట్లు పెట్టినా..!

By:  Tupaki Desk   |   11 Oct 2022 2:30 AM GMT
టాప్ స్టోరి: బాలీవుడ్ కి ఎన్ని చీవాట్లు పెట్టినా..!
X
బాలీవుడ్ ప్ర‌స్తుతం వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర‌మైన క్రైసిస్ ని ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఖాన్ ల త్ర‌యం స‌హా క‌పూర్ లు బ‌చ్చ‌న్ లు రోష‌న్ లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలామంది హిట్లు లేక ఉసూరుమంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సౌత్ నుంచి వెళ్లిన సినిమాలు ఉత్త‌రాదిన బంప‌ర్ హిట్లు కొడుతుంటే పుండు మీద కారం చ‌ల్లిన చందంగా మారుతోంది.

అయినా బాలీవుడ్ మార‌లేదు. అక్క‌డ చాలా మంది నిపుణులు సినీవిశ్లేష‌కులు ఒరిజిన‌ల్ క‌థ‌ల‌తో సినిమాలు తీసి హిట్లు కొట్టాల‌ని సూచిస్తున్నారు. దానిని ప‌ట్టించుకోకుండా ప్రస్తుతం ఉత్త‌రాది హీరోలు ఫిలింమేక‌ర్స్ అంతా సౌత్ రీమేక్ ల‌పై ఆధార‌ప‌డుతున్నారు. బాహుబ‌లి- కేజీఎఫ్-ఆర్‌.ఆర్‌.ఆర్ వంటి చిత్రాల సూపర్ సక్సెస్ ప్రస్తుతం హిందీ ప్రేక్షకులకు `సౌత్` కంటెంట్ హాట్ ఫేవరెట్ గా భావించేలా చేసింది. `అర్జున్ రెడ్డి`ని బాలీవుడ్ లో `కబీర్ సింగ్`గా విజయవంతంగా రీమేక్ చేయడం వల్ల సౌత్ కంటెంట్ పై బాలీవుడ్ నిర్మాతల న‌మ్మ‌కం అమాంతం పెరిగింది. అటుపై ఇబ్బ‌డి ముబ్బ‌డిగా సౌత్ రీమేక్ ల‌పై ప‌డ్డారు.

కానీ అన్నిసార్లు ఒకే లా ఫ‌లితం లేదు. కొన్నిసార్లు ఫ్లాపులు ఎదుర‌య్యాయి. నాని MCA హిందీ రీమేక్ నికమ్మగా.. తమిళ చిత్రం విక్రమ్ వేద రీమేక్ అదే పేరుతో రూపొందాయి. జెర్సీని హిందీలో రీమేక్ చేసారు. కానీ ఇవేవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. విక్రమ్ వేద విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు మాత్రం ద‌క్కించుకుంది. నయన్ `కోలమావు కోకిల` జాన్వీ కపూర్ నాయిక‌గా `గుడ్ లక్ జెర్రీ`గా తెర‌కెక్కి నేరుగా OTTలో విడుదలై ప్రేక్షకులను ఉత్తేజపరిచింది.

ప్రస్తుతం అల వైకుంఠపురంలో రీమేక్ షెహజాదా ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తుండగా... దృశ్యం 2ని అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తాయో వేచి చూడాలి.

ఇక ఖాన్ ల‌లో అమీర్ ఖాన్ భంగ‌పాటు గురించి తెలిసిందే. అమీర్ ఖాన్ హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. `లాల్ సింగ్ చద్దా` అమీర్ కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌ గా నిలిచింది. స్పానిష్ థ్రిల్లర్ మిరాజ్ కి రీమేక్ గా వచ్చిన తాప్సీ దోబారా ఫ్లాపైంది.

అన్ని రీమేక్ లు స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు. కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద మెప్పించినా కానీ కొన్ని సినిమాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. అయినా కానీ సౌత్ రీమేక్ ల కోసం బాలీవుడ్ త‌హ‌త‌హ‌లాడుతోంది. అక్క‌డ ఫిలింమేక‌ర్స్ స్థానిక ప్ర‌తిభావంతుల‌ను న‌మ్మ‌డం లేదు. పైగా సౌత్ ఫిలింమేక‌ర్స్ ని ఒరిజిన‌ల్ క‌థ‌ల‌తో వచ్చి సినిమాలు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. పూణే ఫిలింఇనిస్టిట్యూట్ లో ఫిలింమేకింగ్ శిక్ష‌ణ‌లు.. న్యూయార్క్ ఫిలింఇనిస్టిట్యూట్ ట్రైనింగులు ఇప్పుడు బాలీవుడ్ లో వ‌ర్క‌వుట్ కావ‌డం లేదా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. కానీ బాలీవుడ్ ఎప్ప‌టికైనా ఒరిజిన‌ల్ కంటెంట్ తో మాత్ర‌మే కంబ్యాక్ అవుతుంద‌ని ప్ర‌ముఖ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మాత్రం క‌నిపించ‌డం లేదని విమ‌ర్శ‌లొస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.