Begin typing your search above and press return to search.

వారికి ఊర మాస్ కావాలిట...?

By:  Tupaki Desk   |   30 Dec 2021 2:30 AM GMT
వారికి ఊర మాస్ కావాలిట...?
X
మాస్ లెక్కలు తేల్చేసే సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఆ తరువాత ఊర మాస్ లెవెల్స్ ని కూడా టాలీవుడ్ దాటేసింది. కమర్షియల్ ఫార్మేట్ లో సినిమా అంటే ఇంతకు మించి తీయగలరా అన్న సందేహాలను ఎప్పటికపుడు పక్కనపెడుతూ కొత్త రికార్డులను బద్ధలు కొడుతూ మ్యాజిక్ క్రియేట్ చేసే క్రియేటివిటీ టాలీవుడ్ సొంతం అని గట్టిగానే చెప్పాలి.

తెలుగు సినిమాను తీసుకుంటే మొదటి నుంచి షడ్రుచుల విందు భోజనాన్నే తలపిస్తూ వచ్చింది. ఆరు రకాల రుచులూ అద్భుతంగా ఉండాలి, పండాలి. అదే తెలుగు వారి టేస్ట్. పొరుగున ఉన్న కోలీవుడ్ లో ఆఫ్ బిట్ మూవీస్, ఆలోచనాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తాయి. టాలీవుడ్ లో తీసుకుంటే ఆ తరహా సినిమాలూ తీసి హిట్లు కొట్టిన వారున్నారు. దాంతో పాటుగా కమర్షియల్ కి కూడా పెద్ద పీట వేస్తారు.

గ్లామర్ అంటే టాలీవుడ్ ని చూసే నేర్చుకోవాలి అంటారు. అలాగే మాస్ అంటే తెలుగు సినిమా టేకింగే అని కూడా చెబుతారు. టాలీవుడ్ ఆ విధంగా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా ఆ మధ్య దాకా ఉంటూ వచ్చింది. ఇపుడు తన పక్కా ఊర మాస్ లెక్కలతో బాలీవుడ్ కి కూడా కిక్కు ఇచ్చేస్తోంది. బాలీవుడ్ లో మాస్ మూవీస్ తీస్తారు కానీ వారి పారామీటర్స్ ని కూడా దాటుకుని ఈ రోజు తెలుగు సినిమా పరుగులు పెడుతోంది.

అందుకే బన్నీ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పకు ఈ రోజుకు బాలీవుడ్ లో నలభై కోట్ల కలెక్షన్లు వచ్చాయని చెప్పాలి. అఖండ మూవీని అయితే ఉత్తరాదిన విరగబడి చూశారు. దానికి ముందు సాహో అంటే బ్లాక్ బస్టర్ హిట్ చేసి పారేశారు. ఇపుడు ట్రిపుల్ ఆర్ కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

దీన్ని బట్టి చూసే టాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలీవుడ్ ని మించేస్తోంది తెలుగు సినిమా అన్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే బాలీవుడ్ మాస్ మూవీ కోసం ఎదురుచూస్తోంది. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ ని వీర లెవెల్ లో ప్రెజెంట్ చేసే సినిమాలను వారు బాగా ఇష్టపడుతున్నారు. హీరోని ఏ రేంజిలో ఎలివేట్ చేయాలో ఆ రేంజిలో చేస్తూ ఎక్కడో నిలబెడుతున్న టాలీవుడ్ కి వారు జోహార్ అంటున్నారు.

అందుకే ఒక రాజమౌళి, ఒక బోయపాటి, ఒక సుకుమార్ వారికి బాగా నచ్చేస్తున్నారు. ఇదే తీరులో వెళ్తే రానున్న రోజుల‌లో తీసే ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటుంది. అఖండ మూవీని నిజంగా పాన్ ఇండియా సినిమాగా తీసి ఉంటే ఆ లెక్కే వేరుగా ఉండేదని కలెక్షన్స్ చూస్తే తెలుస్తోంది. దాంతో ఇపుడు టాలీవుడ్ లో కొత్తగా మరిన్ని పాన్ ఇండియా మూవీస్ తయారు చేయడానికి అవసరం అయిన ఎనర్జీని బాలీవుడ్ ఇస్తోంది. మేము చూడడానికి రెడీ, మాకు ప్రాంతీయ ఎల్లలు లేవు, సినిమా మ్యాజిక్ ని లాజిక్ లేకుండా మేము ఆస్వాదిస్తామని ఒట్టేసి మరీ బాలీవుడ్ చెబుతున్న వేళ ఈ బంపర్ ఆఫర్ ని అంచిపుచ్చుకుంటే కనుక మన హీరోలు డైరెక్టర్లు పాన్ ఇండియా సూపర్ స్టార్లే అవుతారు అనడంలో రెండవ మాటే లేదు.