Begin typing your search above and press return to search.
తేడాలొస్తే తాట తీస్తామని స్టార్ హీరోకి హెచ్చరిక
By: Tupaki Desk | 10 May 2022 4:24 AM GMTఇన్నాళ్లుగా ఖాన్ లు కుమార్ ల హవా సాగింది. బచ్చన్ లు కపూర్ లు రోషన్ లు ఏలారు. కానీ మునుముందు సీన్ అంతా రివర్స్ గేర్ లో వెళ్లనుందని తాజా సీన్ చెబుతోంది. సౌత్ నుంచి ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ నుంచి ఓల్డ్ ఏజ్ హిందీ స్టార్లు ధీటైన కాంపిటీషన్ ని ఎదుర్కోబోతున్నారు.
ఇది ఇటీవలి కాలంలో పెద్ద తలనొప్పిగా మారిందని కూడా విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ వారియర్ మూవీ పృథ్వీరాజ్ రిలీజవుతోంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా ముందు డు ఆర్ డై సన్నివేశం కనిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2తో పాటు బాహుబలి 2 రికార్డును కూడా ఈ మూవీ అధిగమించాలి. లేదంటే కుమార్ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది. అంతకుమించి యష్ రాజ్ సంస్థకు ఇది ఎంతో ప్రతిష్ఠాత్మక సినిమా కావడం కూడా భయపెడుతోంది.
తాజాగా పృథ్వీరాజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సన్నివేశం మరింత భయపెట్టింది. పృథ్వీరాజ్ దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది కర్ణి సేన రో- వివాదంపై మౌనం వీడారు. అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ టైటిల్ పై ఎవరూ ఎందుకు అభ్యంతరం చెప్పకూడదో వివరించేందుకు తంటాలు పడ్డాడు.
పద్మావత్ (2018) పై దాడి చేసిన శ్రీ రాజ్ పుత్ కర్ణి సేన ఆ సినిమా విషయంలో ఏడాది పొడవునా నిరసనకు దిగింది. వారు రాజస్థాన్ లో సెట్స్ లో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడి చేసి విజయవంతంగా 4 రాష్ట్రాల్లో సినిమాను నిషేధించారు. దీంతో ఇప్పుడు హిందూత్వ నేపథ్యంలో రియాలిటీ ప్లస్ ఫిక్షన్ కథతో వస్తున్న పృథ్వీరాజ్ కి ఇది చిక్కులు తెస్తోందని గుసగుస వినిపిస్తోంది. తేడాలొస్తే తాట తీస్తామని కర్ణి సేనలు హెచ్చరిస్తున్నాయి.
కారణం ఏదైనా కానీ ఇప్పుడు పృథ్వీరాజ్ దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది కర్ణి సేన రో-పై మౌనం వీడారు. టైటిల్‌పై ఎవరూ ఎందుకు అభ్యంతరం చెప్పకూడదో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
పృథ్వీరాజ్ విడుదలపై శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన అభ్యంతరం వ్యక్తం చేయడంతో చాలా ఆందోళన నెలకొంది. మార్చి 2020లో వారు రాజస్థాన్ లో సెట్స్‌పైకి దూసుకెళ్లారు. ఆ రోజు అదృష్టవశాత్తూ అక్షయ్ కుమార్ హాజరు కాలేదు. అయితే దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది కర్ణి సేన సభ్యులతో మాట్లాడి తమ బాధలను వినిపించారు. ఆ తర్వాత టైటిల్ ను మార్చాలని కర్ణి సేన డిమాండ్ చేసినట్లు కథనాలొచ్చాయి. కానీ టైటిల్ మార్చకుండా ఇప్పుడు టీమ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. దీంతో వార్నింగులు ఎదుర్కోక తప్పడం లేదుట. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలతో తలనొప్పులు బొప్పి కట్టిస్తుంటే ఇప్పుడు ఈ వివాదం ఇంకా ఇంకా కుమార్ కి తలనొప్పులు కీళ్ల వాతం తెస్తోంది.
చోప్రాలకు తప్పని తంటాలు
ఇప్పుడు అక్షయ్ - యష్ రాజ్ బ్యానర్ కాంబినేషన్ లో ఓ భారీ జానపద చిత్రం పృథ్వీరాజ్ విడుదల పెద్ద చర్చగా మారింది. ఈ మూవీ ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 తరహాలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా? అంటూ వాడి వేడిగా చర్చ సాగుతోంది. బాలీవుడ్ ని దశాబ్ధాల పాటు ఏలిన కిలాడీ కుమార్ ఇప్పుడు సౌత్ హీరోలతో పోటీపడి నెగ్గుతాడా? అన్న విశ్లేషణ సాగుతోంది. కొన్నేళ్లుగా స్థిరమైన సక్సెస్ రేట్ తో ఉన్న అక్షయ్ ఇప్పటివరకూ 500 కోట్ల క్లబ్ లో లేడు. అతడు నటించిన సౌత్ సినిమా 2.0 మాత్రమే అతడికి ఆ క్రెడిట్ ని ఇచ్చింది.
అక్షయ్ కుమార్ తదుపరి పృథ్వీరాజ్ అనే శక్తివంతమైన సామ్రాట్ గా కనిపించబోతున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం పరాక్రమం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. అతను క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోర్ కి వ్యతిరేకంగా నిలిచి ధైర్యంగా పోరాడిన యోధునిగా చరిత్ర లిఖించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ - దర్శకుడు డా. చంద్రప్రకాష్ ద్వివేది ఈ చిత్రం మరో స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితానికి అత్యంత ప్రామాణికమైన తెర రూపం ఇవ్వాలని కోరుకున్నారు. ఆదిత్య చోప్రా YRF ఈ మూవీ కోసం తమ భవంతిలో మొత్తం అంతస్తును పృథ్వీరాజ్ కోసం పరిశోధన విభాగంగా మార్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు చంద్రప్రకాష్ మాట్లాడుతూ, -“సినిమా రూపంలో మేము సామ్రాట్ పృథ్వీరాజ్ కి అతిపెద్ద అత్యంత అద్భుతమైన నివాళిని అర్పించాలనుకుంటున్నాం. మేము శక్తివంతమైన హిందూ యోధుని జీవితాన్ని ఆ కాలాన్ని అత్యంత ప్రామాణికమైన రీటెల్లింగ్ చేస్తున్నామని నిర్ధారించుకోవడానికి అవసరమైన ప్రతిదీ చేసాం. భారీ తనం నిండిన చారిత్రాత్మక కథను ప్రయత్నించడానికి మొదటి దశ ఎల్లప్పుడూ పరిశోధన ముఖ్యం. మేము పూర్తిగా క్షుణ్ణంగా హిస్టరీని తెలుసుకుని తెర రూపం ఖచ్చితమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాము.. అని తెలిపారు.
నేను వ్యక్తిగతంగా 2004 నుండి 2019 వరకు స్క్రిప్ట్ ను ప్రతి సంవత్సరం అప్ డేట్ చేస్తూ పనిచేశాను! కాబట్టి సహజంగానే సినిమా చివరి డ్రాఫ్ట్ ను వ్రాయడానికి రిఫరెన్స్ పాయింట్ లుగా ఉపయోగించగల చాలా మెటీరియల్ ని నేను కలిగి ఉన్నాను. అది మాకు నటీనటులకు సినిమాని రూపొందించే సమయంలో మళ్లీ సందర్శించడానికి ఉపకరించింది. చిత్రీకరణ ప్రారంభించే ముందు YRFలోకి అనేక పుస్తకాలు.. సూచనలుగా ఉపయోగించే వివిధ రకాల దుస్తులు- కవచం-ఆయుధాలు పరిశీలించామని తెలిపారు. ఆదిత్య చోప్రా YRF కి చెందిన మొత్తం అంతస్తును పృథ్వీరాజ్ కోసం పరిశోధన విభాగంగా మార్చాడు. షూటింగ్ చివరి రోజు వరకు మేము రీసెర్చ్ విభాగాన్ని పూర్తిగా పని చేసేలా ఉంచాం. ఇప్పుడు ఈ పరిశోధన పనిని ప్రజలకు ప్రదర్శించడానికి ఒక ప్రణాళికను అన్వేషిస్తున్నాం. అద్భుతమైన రాజుకు సాధ్యమైనంత ఉత్తమంగా సెల్యూట్ చేయడానికి చేపట్టిన పని తాలూకా పరిమాణాన్ని ప్రజలు అర్థం చేసుకునేలా ఈ పరిశోధనను వారు ఎంత ఉత్తమంగా ప్రదర్శించగలరో చూడడానికి బృందాలు పని చేస్తున్నాయి... అన్నారు. సినిమా విడుదల ముందు భారీ ప్రమోషన్స్ కి యష్ రాజ్ సంస్థ తెర తీసింది.