Begin typing your search above and press return to search.

కియ‌రా వెడ్స్ సిధ్: పెళ్లిళ్ల‌ పేర‌య్య‌ క‌ర‌ణ్ జోహార్!

By:  Tupaki Desk   |   22 Jan 2023 3:36 PM GMT
కియ‌రా వెడ్స్ సిధ్: పెళ్లిళ్ల‌ పేర‌య్య‌ క‌ర‌ణ్ జోహార్!
X
బాలీవుడ్ ని శాసించే ప్ర‌ముఖ నిర్మాత‌గా కుటుంబ క‌థా చిత్రాల‌ ద‌ర్శ‌కుడిగా KJo కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ద‌శాబ్ధాల పాటు ఎంద‌రో న‌ట‌వార‌సుల‌ను ప‌రిచ‌యం చేసాడు. సాంకేతిక నిపుణుల్లో ఎంద‌రికో లైఫ్ నిచ్చాడు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోతో హోస్ట్ గా బోలెడంత పాపులారిటీ సంపాదించాడు. ఇటీవ‌ల ఓటీటీలో కాఫీ విత్ కర‌ణ్‌ ఎపిసోడ్స్ సంచ‌ల‌నం అయ్యాయి. ఇంత‌టితో స‌రిపెట్టుకోలేదు. అత‌డు బాలీవుడ్ లో జంట‌ల‌ను క‌లిపే ప‌నిలో ఉన్నాడు. పెళ్లిళ్ల‌ పేర‌య్య‌గా మారి పంతులును ఎంగేజ్ చేస్తున్నార‌ట‌ KJo...!

త‌న ఓటీటీ షో స‌మ‌యంలో కియ‌రా అద్వాణీ- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ప్రేమాయ‌ణాన్ని క‌న్ఫామ్ చేసి ఈ జంట‌కు పెళ్ల‌యిపోతోంది ..! అంటూ ఆడియెన్ ని టీజ్ చేసాడు. షో వీక్ష‌కుల‌ను ఆటపట్టించడం మాత్రమే కాదు. కేజేవో ఇంకా చాలా చాలా చేశాడ‌ట‌! త‌న షోకి విచ్చేసిన ఈ జంట‌ జాతకాలను సరిపోల్చడానికి తన పండిట్ (పంతులు గారు) తో సంప్రదింపుల కోసం వివరాలను కూడా వారికి అందించినట్లు అంతర్గత సమాచారం.

ఫిబ్రవరిలో కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లికి ముహూర్తం ఖాయం చేసింది ఈ పంతులు గారేన‌నేది తాజా గుస‌గుస‌. వివాహం విషయానికి వస్తే... బ్యాండ్- బాజా బారాత్ స్టైల్లో అన్ని తమాషాలు ఉండబోతున్నాయి. కరణ్ జోహార్ తన కాఫీ సోఫాలో ఈ జంట పెళ్లి గురించి అంచ‌నా వేయమంటూ ప్రేక్షకులను ఆటపట్టించడం మాత్రమే కాకుండా వీరిద్దరి జాతకాలను సరిపోల్చడానికి తన పండిట్ స‌హ‌కారం అందించే ఏర్పాటు చేయ‌డంతో ఇప్పుడు అత‌డిని పెళ్లిళ్ల పేర‌య్య‌గా పోలుస్తున్నారు నెటిజ‌నులు.

కేజోవో `లస్ట్ స్టోరీస్` ముగింపు పార్టీలో కలుసుకుని షేర్షా సెట్ లో డేటింగ్ ప్రారంభించిన మల్హోత్రా -అద్వానీ.. చాలా కాలంగా త‌మ‌ పెళ్లి గురించి పెదవి విప్పకపోయినా లవీ-డోవీ వ్య‌వ‌హారాల‌పై గాసిప్పులు వైర‌ల్ అయ్యాయి. ఆ గాసిప్పుల ఆధారంగా కేజీవో బ‌రిలో దిగారు. అప్ప‌టి నుంచి అంతా బ‌హిరంగ‌మే అయిపోయింది.

సిద్ధార్థ్ - కియారా జంట‌ ఇటీవలి కాలంలో రిలేష‌న్ షిప్ విష‌యంలో మరింత బహిరంగంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ వారం మిషన్ మజ్ను స్పెషల్ స్క్రీనింగ్ లో కియారా- సిధ్ తో క‌లిసి క‌నిపించింది. క‌లిసి ఈ జంట సినిమా చూడటం అంద‌రినీ ఆక‌ర్షించింది. యువ జంట‌ సిగ్గును విడిచి స‌ర‌సాలాడుకుంటూ ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేయడంలో మునుప‌టిలా దాప‌రికాన్ని అనుస‌రించ‌డంలేదనేది తాజా గుస‌గుస‌!!