Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్పై యూనివర్స్.. YRF బిగ్ ప్లాన్!

By:  Tupaki Desk   |   7 Jan 2023 9:48 AM GMT
బాలీవుడ్ స్పై యూనివర్స్.. YRF బిగ్ ప్లాన్!
X
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ స్టార్ హీరోలు యాక్షన్ సినిమాలు అలాగే ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు. కంటెంట్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది అంటే అందరూ ఖాన్ లు కూడా సినిమాలు చేయడానికి సిద్ధమే అని చెప్పేశారు.

అయితే రాబోయే రోజుల్లో మాత్రం మరికొన్ని మల్టీ యూనివర్స్ యాక్షన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సంస్థలో సినిమాలు చేసేందుకు అగ్ర హీరోలు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇక రీసెంట్ గా YRF నిర్వాహకులు ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చే మల్టీవర్స్ ప్రాజెక్టుల గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సంస్థలో టైగర్ 3 సినిమాతో పాటు పటాన్ సినిమా కూడా తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు కూడా యాక్షన్ అడ్వెంచర్ స్పై సినిమాలు గా రాబోతున్నాయి.

స్టార్ హీరోలు ఇద్దరూ కూడా స్పై లుగా కనిపించబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అయితే మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా ఈ యూనివర్స్ లో కలవబోతున్నట్లుగా తెలుస్తోంది.

2012లో సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ అలాగే 2017లో టైగర్ జిందా హై సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు కూడా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. ఇక 2019లో టైగర్ ష్రాఫ్ హృతిక్ రోషన్ హీరోలుగా వార్ సినిమా వచ్చింది. ఇక ఈ ఏడాది షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా రాబోతోంది.

అయితే ముందుగా పఠాన్ సినిమాలో అయితే సల్మాన్ ఖాన్ పాత్ర కూడా కనిపించబోతోంది. ఇక ఈ సినిమాలు అన్నిటికీ కూడా మళ్లీ మల్టీవర్స్ తరహాలో రెడీ చేస్తున్నట్లుగా యష్ రాజ్ ఫిలిమ్స్ క్లారిటీ అయితే ఇచ్చింది. భవిష్యత్తులో మాత్రం ఇంకా ఊహించని స్థాయిలో స్పై మల్టీవర్స్ సినిమాలు వస్తాయని అంటున్నారు. ఈ తరహాలో సినిమాలు వచ్చాయంటే బాక్సాఫీస్ తట్టుకోవడం కష్టమే అని కామెంట్స్ వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.