Begin typing your search above and press return to search.

బ్రేకప్‌ కాదు.. పెళ్లి పీఠలు ఎక్కబోతున్న స్టార్‌ జంట

By:  Tupaki Desk   |   31 Oct 2022 1:30 PM GMT
బ్రేకప్‌ కాదు.. పెళ్లి పీఠలు ఎక్కబోతున్న స్టార్‌ జంట
X
బాలీవుడ్‌ లో లవ్ స్టోరీస్ కొత్తేం కాదు. హీరో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ప్రేమలో పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువ శాతం లవ్‌ స్టోరీస్‌ మీడియా ముందుకు రాకుండానే బ్రేకప్‌ అవుతున్నాయి అనేది బాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుస. ఇక కొన్ని ప్రేమ కథలు మీడియాలో హడావుడి చేసి కొన్నాళ్లకు ఎండ్‌ అవుతున్నాయి.

చాలా కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు చేరుకుంటున్నాయి. ఆ మధ్య కత్రీనా కైఫ్.. విక్కీ కౌశల్‌ మరి కొన్ని జంటల ప్రేమ కథలు పెళ్లి వరకు చేరాయి. పెళ్లి చేసుకున్న స్టార్‌ కపుల్‌ ఫుల్‌ ఎంజాయ్ గా ఉన్నారు.

హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. కనుక ప్రస్తుతం ప్రేమలో ఉన్న స్టార్ కపుల్‌ వెంటనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లుగా బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గత కొన్నాళ్లుగా కియారా అద్వానీ మరియు సిద్దార్థ్‌ మల్హోత్ర ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి బ్రేకప్‌ అయ్యారు అంటూ పుకార్లు షికార్లు చేసినా వాటిని కొట్టి పారేసి మళ్లీ జంటగా వీరిద్దరు కలిశారు. తాము ఇద్దరం కలిసే ఉన్నాం పెళ్లి కూడా త్వరలో ఉంటుంది అన్నట్లుగా చెప్పకనే చెప్పారు.

తాజాగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కియారా అద్వానీ మరియు సిద్దార్థ్‌ మల్హోత్ర లు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారట. ఔను డిసెంబర్‌ నెలలోనే వీరి పెళ్లి ఉంటుందనే వార్తలు బాలీవుడ్‌ లో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా అయితే ప్రకటన రాలేదు.

ఇప్పటి వరకు వీరి పెళ్లి నిశ్చితార్థం జరగలేదు.. డిసెంబర్‌ లో పెళ్లి అంటే ఎలా నమ్మేది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ పెళ్లి వార్తలపై సిద్దార్థ్‌ మల్హోత్ర లేదా కియారా అద్వానీలు ఎలా స్పందిస్తారో చూడాలి. వీరిద్దరు కూడా కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఈ సమయంలో పెళ్లి అవసరమా అంటూ కొందరు వీరిని ప్రశ్నిస్తున్నారట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.