Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా లెవల్ లో 'పుష్ప' ఐటెం సాంగ్
By: Tupaki Desk | 14 April 2020 8:10 AM GMTఅల్లు అర్జున్ 20వ చిత్రం పుష్ప ను తెలుగులోనే కాకుండా హిందీ ఇంకా సౌత్ భాషలన్నింటిలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అయిదు భాషల్లో పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది. హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఈ చిత్రంలో విలన్ పాత్రకు గాను సంజయ్ దత్ లేదా సునీల్ శెట్టిని తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రముఖ స్టార్స్ ను ఈ చిత్రంలో పార్ట్ చేస్తున్న దర్శకుడు సుకుమార్ తాజాగా ఐటెం సాంగ్ ను కూడా పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడట.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ ‘పుష్ప’ చిత్రం కోసం బాలీవుడ్ ఐటెం బాంబ్ ఊర్వశి రౌటెలాతో సంప్రదింపులు జరుపుతున్నాడట. బాలీవుడ్ లో ప్రస్తుతం ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు హీరోయిన్ గా కూడా నటిస్తున్న ఈ అమ్మడి ఎంట్రీతో పుష్పకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం అని ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ ను ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆశిస్తారు. ఈయన గత చిత్రం రంగస్థలంలో ఐటెం సాంగ్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు మించి ‘పుష్ప’లో ఐటెం సాంగ్ ఉండేలా దేవి శ్రీ ప్రసాద్.. సుకుమార్ లు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టేందుకు సుకుమార్ రెడీగా ఉన్నాడు.