Begin typing your search above and press return to search.
వైరల్ అయిన స్టార్ కపుల్ బెడ్ రూమ్ ముచ్చట్లు
By: Tupaki Desk | 2 Jan 2020 9:53 AM GMTబాలీవుడ్ రొమాంటిక్ కపుల్ అనగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే జంట రణ్ వీర్ సింగ్ దీపిక పదుకునే. వీరిద్దరు చాలా కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత వీరిద్దరు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు దీపిక పదుకునే పట్ల రణ్ వీర్ చూపించే శ్రద్ద మరియు ప్రేమ అందరిని ఆశ్చర్యపర్చుతూ అమ్మాయిలు కుళ్లుకునేలా చేస్తుంటాయి. తాజాగా మరోసారి తనలోని రొమాంటిక్ యాంగిల్ ను రణ్ వీర్ కపూర్ చూపించడంతో దీపిక సిగ్గుతో ముడుచుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే దీపిక పదుకునే మరియు రణ్ వీర్ సింగ్ లు ఇటీవల ఒక అవార్డు వేడుకలో పాల్గొన్నారు. ఆ సమయంలో వారిద్దరు కలిసి స్టేజ్ పైకి వెళ్లారు. స్టేజ్ పై ఉన్న హోస్ట్ వారిద్దరిని మాట్లాడిసున్నాడు. అప్పుడే మీరు ఉదయం బెడ్ మీద నుండి లేచేప్పుడు ఏ సైడ్ లేస్తారు అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు కన్ఫ్యూజ్ అయిన దీపిక కాస్త సిగ్గు పడుతూ కుడివైపు నుండి దిగుతాను అంటూ సమాధానం చెప్పింది. ఆ ప్రశ్న ఏంట్రా బాబు అని చాలా మంది అనుకున్నారు.
దీపిక సమాధానం చెప్పగానే వెంటనే రణ్ వీర్ సింగ్ మైక్ అందుకుని దీపిక చెప్పింది నిజమే. ఆమె ఉదయం కుడి వైపు నుండి దిగుతుంది. ఎడమ వైపు నేను ఉంటాను. నా వైపు నుండి దిగేందుకు ప్రయత్నిస్తే ఆమెను అంత త్వరగా బెడ్ దిగనివ్వను అంటూ సరదాగా అన్నాడు. దాంతో అక్కడున్న వారు అంతా నవ్వగా దీపిక మొహం మాత్రం కాస్త ఎర్రబడింది. ఇక చాలు అన్నట్లు గా టాపిక్ చేంజ్ చేయించింది. మొత్తానికి ఈ స్టార్ కపుల్ బెడ్ రూం విషయాలు ఇలా బయట చెప్పడంతో అది కాస్త వైరల్ అయ్యింది.