Begin typing your search above and press return to search.

నైట్ పార్టీల్లో స్టార్ కిడ్స్ జ‌ల్సాలే జ‌ల్సాలు

By:  Tupaki Desk   |   10 Aug 2022 4:10 AM GMT
నైట్ పార్టీల్లో స్టార్ కిడ్స్ జ‌ల్సాలే జ‌ల్సాలు
X
ముంబై టు లండ‌న్ బాలీవుడ్ స్టార్ కిడ్స్ విలాసాల జీవితం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. బ‌ర్త్ డే పార్టీలు.. బికినీ బీచ్ పార్టీలు.. యూరోప్ వెకేష‌న్లు అంటూ సంద‌డే సంద‌డిగా లైఫ్ రంజుగా సాగుతుంటుంది. తాజాగా స్టార్ హీరో అజయ్ దేవగన్ కుమార్తె నైసా లండన్ లో సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి- అర్జున్ రాంపాల్ కుమార్తె మహికాతో పార్టీ క్రౌడ్ లో కలకలం రేపింది.

స్టార్ డాట‌ర్ నైసా ఈ పార్టీలో ఎంతో నైసుగా క‌నిపించిందంటూ యూత్ మైమ‌రిచిపోతున్నారు. అంత‌గా నైసా దివ్య‌మైర రూపం క‌ట్టి ప‌డేస్తోంది. లండన్ పార్టీలో బోయ్ ఫ్రెండ్ ఓర్హాన్ తో ఫుల్ చిల్లింగ్ గా గ‌డ‌ప‌డంపైనా ఇత‌రులు బోలెడ‌న్ని ఆరాలు తీస్తున్నారు.

గత రెండు నెలలుగా నైసా తన పార్టీ నుంచి వ‌రుస‌గా ఫోటోల‌ను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. వీటిలో సునీల్ శెట్టి కుమారుడు అహన్ .. అర్జున్ రాంపాల్ కుమార్తె మహికాతో బ్లాస్ట్ అయ్యే రేంజులో నైసా చెల‌రేగింద‌ని పార్టీ ఫోటోలు చెబుతున్నాయి.

నైసా గ్రూప్ ఫోటోల‌కు ఫోజులివ్వ‌గా వాటిలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. తన క్లోజ్ బ‌డ్డీ మహికా స‌హా ఇతర పార్టీ గ్యాంగ్ తో గ్రూప్ పిక్చర్ లో నైసా గులాబీ రంగు దుస్తులు ధరించి కనిపించింది. ఇంత‌కీ ఈ పార్టీ ఎవ‌రి కోసం? అంటే.. నైనా దేవ‌గ‌న్ బోయ్ ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణి 27వ పుట్టినరోజు వేడుక అని తెలిసింది.

ఓర్హాన్ కి నైసా- అహన్ - మహికా క్లోజ్ ఫ్రెండ్స్. పార్టీ మూడ్ లోకి వెళ్లారంటే గ్యాంగ్ అంతా చిల్లింగ్ గా క‌లిసిపోతుంటారు. ప్ర‌స్తుతం త్రోబ్యాక్ పార్టీకి చెందిన ర‌క‌ర‌కాల దృశ్యాలను ఆవిష్క‌రించే ఫోటోలు వెబ్ లో ఠారెత్తుతున్నాయి. నైసా లండన్ పార్టీ స్టైల్ పై మరికొన్ని గ్లింప్స్ వెబ్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

త్వ‌ర‌లోనే నైసారంగేట్రం?

బాలీవుడ్ లో స్టార్ డాట‌ర్స్ వ‌రుస‌గా బ‌రిలో దిగుతున్నారు. శ్రీ‌దేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్.. కింగ్ ఖాన్ షారూక్ కుమార్తె సుహానా ఖాన్.. నిర్మాత సంజ‌య్ క‌పూర్ కుమార్తె స‌నాయ ఇప్ప‌టికే క‌థానాయిక‌లుగా ఆరంగేట్రం చేస్తున్నారు. అలాగే దేవ‌గ‌న్ - కాజోల్ జంట కుమార్తె నైసా కూడా క‌థానాయిక అవుతుందా? అన్న‌దానికి ఇంకా స‌మాధానం లేదు.

కానీ నైసా వైబ్స్ చూస్తుంటే నైసుగా రంగుల ప్ర‌పంచంలో ప్ర‌వేశించ‌డం ఖాయ‌మ‌న్న న‌మ్మ‌కం పెరుగుతోందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నైసా మామ్ కాజోల్ బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా ఏలింది. డాడ్ స్టార్ హీరోగా బాలీవుడ్ ని ఏల్తున్నాడు. అందుకే త‌న‌పై ఫ్యాన్స్ లో బోలెడన్ని అంచ‌నాలున్నాయి.