Begin typing your search above and press return to search.

వీడియో: మంట‌ల్లో హీరో .. తెర‌వెన‌క ప్రిప‌రేష‌న్

By:  Tupaki Desk   |   6 March 2019 5:27 AM GMT
వీడియో: మంట‌ల్లో హీరో .. తెర‌వెన‌క ప్రిప‌రేష‌న్
X
కిలాడీ అక్ష‌య్ కుమార్ డేర్ డెవిల్ స్టంట్స్ గురించి బాలీవుడ్ తో పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటారు. స్వ‌త‌హాగా మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యం ఉన్న ఈ హీరో ఇంతింతై అన్న చందంగా బాలీవుడ్ లో ఎద‌గ‌డం వెన‌క అత‌డి డేరింగ్ ఫీట్స్ చాలానే ఉన్నాయి. ఖాన్ లు ఏలే చోట త‌న‌కంటూ ఒక సామ్రాజ్యం ఉంద‌ని నిరూపించాడంటే అత‌డు ఎంత‌టి డేరున్న హీరోనో ఊహించ‌వ‌చ్చు. నిన్న‌టి సాయంత్రం అక్కీ ఓ వెబ్ సిరీస్ లాంచ్ కార్య‌క్ర‌మంలో అహూతుల‌కు బిగ్ షాక్ ఇచ్చే విన్యాసాలు చేశాడు. ఒళ్లంతా మంట‌ల్లో త‌గ‌ల‌బ‌డుతుంటే స్టేజీపై క్యాట్ వాక్ చేసి ఔరా! అనిపించాడు.

అస‌లు ఇదెలా సాధ్యం? ఒంటిపై నిప్పు అంటుకుంటే అంత డేరింగ్ గా ఉండ‌డం ఎలా కుదురుతుంది? అంటూ అంతా ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. అయితే అలా ఫైర్ అంటించుకునే ఫీట్ చేయ‌డానికి ముందు కిలాడీ అక్ష‌య్ ఎంత‌గా ప్రిపేర‌య్యాడో ఈ వీడియో చూస్తే అస‌లు సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. బ్యాక్ స్టేజ్ లో అక్ష‌య్ ని ప్రిపేర్ చేసేందుకు ఓ టీమ్ చాలానే శ్ర‌మించింది.

అత‌డు ధ‌రించిన జాకెట్ నుంచి ఆ ఫైర్ అంటుకునే మైన‌పు పూత వేసే వ‌ర‌కూ ప్ర‌తిదీ ఎంతో కేర్ తీసుకుని శ్ర‌ద్ధ‌గా ప‌ని చేశారంతా. ఒళ్లు అంటుకోకుండా ప్ర‌త్యేకించి యాంటీ ఫైర్ ప్రూఫ్ మైనం ఒంటికి పులుముకున్నాడు. దానిపై ఫైర్ ప్రూఫ్ జాకెట్ ధ‌రించాడు. ఆ సూట్ కి నిప్పు అంటుకున్నా ఏమీ కాదు. పైగా ఆ బ్లాక్ క‌ల‌ర్ సూట్ పై పూసిన లేప‌నం మాత్ర‌మే మండుతుంది. ఓ ముగ్గురు బ్యాక్ స్టేజ్ లో కిలాడీకి కాగ‌డాల‌తో నిప్పు అంటించ‌డం వీడియోలో క‌నిపిస్తోంది. ఒక‌సారి అలా వేదిక‌పైకి క్యాట్ వాక్ చేస్తూ వెళ్లిన అక్ష‌య్ తిరిగి అదే తీరుగా వెంట‌నే వెన‌క్కి వ‌చ్చేశాడు. బ్యాక్ స్టేజ్ కి రాగానే నేల‌పై బోర్లా ప‌డుకున్నాడు. ఆ వెంట‌నే అత‌డిపై నీళ్ల‌లో త‌డిపిన కంబ‌ళ్ల‌ను మూత వేసి మంట‌ల్ని ఆర్పేసారు. ఇలాంటి ఫీట్స్ మ్యాజిక్ షోల్లో మాత్ర‌మే చూడ‌గ‌లం. ఇలా ఓ స్టార్ హీరో అంత డేరింగ్ గా ఈ ఫీట్ వేయ‌డం అన్న‌ది చాలా అరుదు. అయితే కిలాడీ అక్ష‌య్ విన్యాసాలు ఎందుకోసం అంటే .. త‌న కొడుక్కి ఇచ్చిన మాట కోసం. కొడుక్కి ఎంతో ఇష్ట‌మైన వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తాన‌ని మాటిచ్చాడు. అలా అమెజాన్ తో `ది ఎండ్` అనే వెబ్ సిరీస్ కి సంత‌కం చేశాడు. కిలాడీ విన్యాసాలు చూసిన వైఫ్ ట్వింకిల్ మాత్రం కంగారు ప‌డిపోయింది. ఇంటికొస్తే చంపేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది!


For Video Click Here