Begin typing your search above and press return to search.

చరణ్ డాడీగా ఆ హీరోనా ?

By:  Tupaki Desk   |   9 July 2019 10:40 AM IST
చరణ్ డాడీగా ఆ హీరోనా ?
X
టాలీవుడ్ మెజీషియన్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జక్కన్న అమెరికా నుంచి తిరిగి రాగానే ఎక్కడ షెడ్యూల్ కంటిన్యూ చేయబోతున్నారో తెలుస్తుంది. ఇప్పటికీ కొన్ని పాత్రలకు సంబంధించిన క్లారిటీ రాకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా చేస్తారని చెప్పారు తప్ప మిగిలిన యాక్టర్స్ గురించి ఏ చిన్న క్లూ ఇవ్వడం లేదు.

ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఎలాంటి రోల్ చేయబోతున్నాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది. అయితే లీకైన న్యూస్ ప్రకారం ఇందులో అతను ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో రామ్ చరణ్ కు తండ్రిగా నటిస్తున్నాడట. చరణ్ టీనేజ్ వయసు వచ్చాక స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు ప్రేరేపించేలా ఉండే సన్నివేశాలు ఈ ఇద్దరి కాంబోలో ఉంటాయట. జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఈ సీన్స్ లో ఉండకపోవచ్చని ఇన్ సైడ్ టాక్.

ఇది అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి వెంటనే ఓ నిర్ణయానికి రాలేం కానీ నిజమైతే మాత్రం ఇదో స్పెషల్ ఎపిసోడ్ గా నిలిచిపోతుంది. కనిపించేది కొంతభాగమే అయినా మర్చిపోలేని రీతిలో రాజమౌళి అజయ్ దేవగన్ పాత్రను డిజైన్ చేశాడట.ఆర్ఆర్ఆర్ తాలూకు ఫస్ట్ లుక్స్ హంగామా డిసెంబర్ నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది. తొలుత అజయ్ దేవగన్ పాత్రదే రివీల్ చేస్తారని వినికిడి. చూద్దాం