Begin typing your search above and press return to search.
కరోనా ఆరోపణలపై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో
By: Tupaki Desk | 31 March 2020 10:50 AM GMTకరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నది. కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి మానవాళికి కునుకు లేకుండా చేస్తోంది. సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. ప్రధానంగా విదేశాల నుండి స్వదేశాలకు తిరిగివస్తున్న సెలబ్రిటీలపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే విదేశీ పర్యటన నుండి తిరిగొచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి కరోనా సోకినా విషయం తెలిసిందే. ఈ మధ్య ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కుటుంబానికి సైతం కరోనా సోకినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై అజయ్ దేవగణ్ స్పందించి ఈ వార్తలను ఖండించాడు.
వివరాల్లోకి వెళ్తే అజయ్ దేవగన్, కాజోల్ కుమార్తె నిశా సింగపూర్లో చదువుకుంటోంది. కరోనా ప్రభావం కారణంగా ఆమెను కాజోల్ స్వయంగా సింగపూర్ వెళ్ళి ముంబై తీసుకొచ్చారు. దీంతో వారికి కరోనా ఎఫెక్ట్ అయిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. వీటిపై స్పందించిన అజయ్ దేవగన్ కాజోల్, నిశా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ధృవీకరించారు. ఇకపోతే కాజోల్, నిశా ఇద్దరూ వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా అజయ్ దేవగణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు 'మైదాన్' అనే క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో కూడా నటిస్తున్నాడు.