Begin typing your search above and press return to search.

జ్యోతిష్యం జోక్‌ కాదు.. నా జీవితంలో రెండు సార్లు నిజమయ్యింది

By:  Tupaki Desk   |   27 Dec 2021 9:15 AM GMT
జ్యోతిష్యం జోక్‌ కాదు.. నా జీవితంలో రెండు సార్లు నిజమయ్యింది
X
కంప్యూటర్‌ యుగంలో కూడా ఈ జ్యోతిష్యం ఏంటీ.. ఈ జాతకాలు ఏంటో అంటూ కొందరు అంటూ ఉంటారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇంకా జ్యోతిష్యంను నమ్ముతూనే ఉన్నారు. జాతకాలు మరియు వాస్తు ను నమ్మే వారు ఎంతో మంది ఉన్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పేరు ఏదైనా జ్యోతిష్యంను నమ్ముతున్నారు అనడంలో సందేహం లేదు. జ్యోతిష్యం పేరు మార్చుకుని ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపంలో నమ్మబడుతుందని జనాల అభిప్రాయం.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ మాట్లాడుతూ జ్యోతిష్యంను అంత తేలికగా తీసుకోవద్దు.. జ్యోతిష్యం జోక్‌ కానే కాదు అన్నాడు. తన జీవితంలో జ్యోతిష్యం అనేది రెండు సార్లు నిజం అయ్యిందని.. జ్యోతిష్యం కు ప్రత్యక్ష సాక్ష్యం తన జీవితం అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్ కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా హోస్ట్‌ గా చేస్తున్న ఒక టాక్ షో లో జాకీ ష్రాఫ్‌ పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆయన పలు విషయాలను వెళ్లడించాడు. తన కెరీర్‌ తో పాటు తన కుటుంబం ఇతర విషయాల గురించి మాట్లాడాడు. ఆ సమయంలోనే తాను జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను.

జ్యోతిష్యం ను నమ్మడం అనేది మంచిది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. జ్యోతిష్యంను నమ్మడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు జాతకాలు నమ్మాలి అన్నట్లుగా అతడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటీ అంటూ కొందరు జాకీ ష్రాఫ్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు.

వాళ్ల ప్రశ్నలకు జాకీ సరైన సమాధానాలే ఇచ్చాడు. జాకీ మాట్లాడుతూ నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా అన్నయ్య చనిపోయాడు. అన్నయ్య చనిపోయిన సమయంలో అతడి వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. ఒక వ్యక్తిని కాపాడటం కోసం అన్నయ్య ప్రాణాలు వదిలాడు. ఆరోజున నాన్న గారు అన్నయ్యను పనికి వెళ్లవద్దని వారించాడు. ఈ రోజు నీ జాతకంలో బాగా లేదు.. ప్రమాదం పొంచి ఉంది కనుక ఇంట్లోనో ఉండాలని ఎంత గా చెప్పినా కూడా అన్నయ్య వినిపించుకోలేదు.

ఉద్యోగంకు వెళ్లిన అన్నయ్య సముద్రంలో పడ్డ ఒక వ్యక్తిని కాపాడేందుకు గాను తాను దూకాడు. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో అన్నయ్య చనిపోయాడు. అన్నయ్య చని పోయి ఇన్నాళ్లు అయినా కూడా ఆయన మా మనసులో ఉన్నాడు. అన్నయ్య ఆ రోజు నాన్న మాట విని ఉంటే బాగుండేది. నాన్న నా గురించి ఒక సారి మాట్లాడుతూ జీవితంలో మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకుంటావు అన్నాడు.

ఆయన అన్నట్లుగానే.. జ్యోతిష్యం నిజం అన్నట్లుగానే నేను మంచి నటుడిగా పేరు దక్కించుకున్నాను. నాకు మంచి జీవితం లభించింది. అలా రెండు విషయాలు నాన్న చెప్పినట్లుగానే జరిగాయి. కనుక నేను ఎప్పుడు కూడా జ్యోతిష్యంను తేలికగా తీసుకోను అన్నట్లుగా జాకీ ష్రాఫ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

జాకీ ష్రాఫ్‌ జాతకాలను మరీ గుడ్డిగా నమ్మేస్తాడు అనే ఆరోపణలు లేకపోలేదు. ఆయన నమ్మడం కాకుండా ఆ మూడ నమ్మకాలను ఇలా ప్రచారం చేయడం ఏంటీ అంటూ కొందరు ఆయన్ను విమర్శిస్తున్నారు. ఒకరి వ్యక్తిగత విషయాలను అభిప్రాయాలను మరొకరిపై రుద్దే ప్రయత్నాలు చేయకూడదు. కాని జాకీ ష్రాఫ్ మాత్రం జ్యోతిష్యాలను నమ్మించేందుకు చాలా ప్రయత్నిస్తాడు అనేది ఆరోపణ.