Begin typing your search above and press return to search.
సక్సెస్ దక్కి పదేళ్లయినా సూపర్ స్టార్ జోరు తగ్గేదేలే...!
By: Tupaki Desk | 8 July 2022 3:30 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుని దాదాపుగా పది సంవత్సరాలు అయ్యింది. భారీ బడ్జెట్ చిత్రాలను గత పదేళ్ల కాలంలో చేసిన షారుఖ్ ఖాన్ కమర్షియల్ డిజాస్టర్స్ ను చవి చూశాయి. ఆయన చివరగా జీరో సినిమాను చేసి జీరో అయ్యాడనే విమర్శలు కూడా వచ్చాయి. ఎన్ని ప్లాప్ లు పడ్డా మళ్లీ ఆయన సినిమా రాబోతుంది అంటే సందడి వాతావరణం కనిపిస్తోంది.
జీరో ఫలితం.. కరోనా ప్రభావం వల్ల షారుఖ్ ఖాన్ దాదాపుగా నాలుగు సంవత్సరాల బ్రేక్ తీసుకున్నాడు. ఆయన హీరోగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం పఠాన్ తో పోల్చితే అంతా కూడా జవాన్ గురించి ఎక్కువగా చర్చించుకోవడం కనిపిస్తోంది.
జవాన్ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో కనీసం థియేట్రికల్ రిలీజ్ కన్ఫర్మ్ కాకముందే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు అనే వార్తలు ఇటీవల వచ్చాయి. తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా రూ.120 కోట్ల రూపాయలకు గాను చెల్లించబోతున్నట్లుగా తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ సినిమా వంద కోట్ల వసూళ్లు రాబట్టడం కష్టం అనుకుంటూ చర్చలు జరుగుతున్న సమయంలో కేవలం ఓటీటీ కి 120 కోట్ల రూపాయలను నెట్ ఫ్లిక్స్ చెల్లించడం తో ఆయన స్థాయి ఏంటో ఇప్పటికే అర్థం అయ్యింది. అద్బుతమైన సినిమా గా జవాన్ ఉండబోతుందని నెట్ ఫ్లిక్స్ వారు నమ్మకంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
జవాన్ సినిమా లో షారుఖ్ ఖాన్ ద్వి పాత్రాభినయం చేస్తున్నాడు. సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. సౌత్ కు చెందిన పలువురు నటీ నటులు నటించబోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా సినిమాకు మంచి బిజినెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని షారుఖ్ జవాన్ తో దక్కించుకుంటే మళ్లీ ఆయన దశాబ్ద కాలం పాటు టాప్ స్టార్ గా కొనసాగుతాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.