Begin typing your search above and press return to search.

#సుశాంత్.. నవంబ‌ర్ లోనే పెళ్లి ఇంత‌లోనే!

By:  Tupaki Desk   |   15 Jun 2020 4:15 AM GMT
#సుశాంత్.. నవంబ‌ర్ లోనే పెళ్లి ఇంత‌లోనే!
X
యువ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఇది ఆత్మ‌హ‌త్య‌నా? హ‌త్యా అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. ఒక సెక్ష‌న్ మీడియా ఇది ఆత్మ‌హ‌త్య అని చెబుతుంటే ఇంకో సెక్ష‌న్ నుంచి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సుశాంత్ మేన‌మామ స‌హా అభిమానులు నేరుగా ప్ర‌ధాని పూనుకుని సీబీఐ ద‌ర్యాప్తు చేయించాల‌ని కోరుతున్నారు. బాలీవుడ్ ‌లో చ‌క్క‌ని స్టార్ ‌డ‌మ్ ‌తో వెలుగొందుతున్న సుశాంత్ సింగ్‌ అర్థాంత‌ర మ‌ర‌ణంపై ఎన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక సుశాంత్ ఏజ్ 34. అంటే పెళ్లికి ఇంట్లో వాళ్లు తొంద‌ర‌ప‌డుతున్న త‌రుణ‌మిది. ఇంత‌కీ సుశాంత్ పెళ్లాడాల‌నుకున్నాడా లేదా? అంటే.. ఈ ఏడాది నవంబర్ ‌లో పెళ్లికి రెడీ అవుతున్నాడ‌ని అత‌నికి వ‌రుస‌కు సోద‌రుడైన పన్నా సింగ్ చెబుతున్నారు. సుశాంత్ వివాహానికి సన్నాహకాల్లోనే ఉన్నాం. కుటుంబ‌మంతా ఈ పెళ్లికి రావడానికి సిద్ధమవుతున్నారు అని ఆయ‌న వెల్ల‌డించారు. సుశాంత్ పెళ్లి మూడ్ లో ఉన్నాడ‌న్న సంగ‌తి అత‌డు ఇచ్చిన హింట్ ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

అయితే ఉన్న‌ట్టుండి అనూహ్యంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. నిరాశ‌నిస్పృహ‌లు ఒత్తిడి కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పోలీసులు చెబుతున్నా.. ఇది హ‌త్యా? అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు సాగుతోంద‌ని తెలుస్తోంది.