Begin typing your search above and press return to search.
#సుశాంత్.. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే..
By: Tupaki Desk | 15 Jun 2020 4:45 AM GMTయంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడా? ఐదారు నెలలుగా అతడు ఆస్పత్రిలో అందుకు సంబంధించిన చికిత్స పొందుతున్నాడా? అంటే అవుననే ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు.
ఆదివారం (జూన్ 14) ఉదయం 10 నుంచి ఒంటి గంట మధ్యలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ముంబైలోని అతని ఇంటికి వెళ్లి ప్రాథమిక విచారణ చేపట్టారు. అనుమానించేలా ఏమీ కనిపించలేదని తొలుత పోలీసులు వెల్లడించారు. పోలీస్ విచారణ ప్రారంభమైన సమయం 2-2.30. అయితే అప్పటికే సుశాంత్ బెడ్ పై పడి ఉన్నాడు.
ఉరికి వేలాడిన అతడి మృతదేహాన్ని స్నేహితులు.. ఆఫీస్ స్టాఫ్ కిందికి దించారు. సూసైడ్ ఉదయం 10నుంచి 1గంట మధ్యలోనే అయ్యుండాలని పోలీసులు సందేహించారు. అయితే సుశాంత్ రెగ్యులర్ గా హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అది దేనికోసం? అన్నది అతడు వాడుతున్న మందుల ఆధారంగా విచారించారు. అయితే ఐదారు నెలలుగా అతడు డిప్రెషన్ కి మెడిసిన్ తీసుకుంటున్నాడని సాగుతున్న ప్రచారంలో నిజం ఎంత? అన్నది ఇంకా పోలీసులు వెల్లడించలేదు.
ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే క్లారిటీ వస్తుందన్నది వారి వెర్షన్. కానీ ఒత్తిడి వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం సాగిపోయింది. అయితే ఇది అనుమానాస్పద మృతి.. హత్య! అంటూ మేనమామ సహా అభిమానులు సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. దీనిని బట్టి ఇది అనుమానాస్పద కేసుగానే భావించాల్సి ఉంటుంది. ఇంకా హిందూజా డాక్టర్ స్టేట్ మెంట్ వెల్లడి కావాల్సి ఉంది.