Begin typing your search above and press return to search.
సౌత్ ఇండస్ర్టీని అలా కాకా పడుతోన్న బాలీవుడ్ స్టార్!
By: Tupaki Desk | 12 Sep 2022 6:33 AM GMTసౌత్ ఇండస్ర్టీ సత్తా ఏంటో తెలిసిన తరుణమిది. ఒకప్పటి రీజనల్ మూవీ ఇప్పుడు ఇండియన్ సినిమాగా మారిపోయింది. రకరకాల తారతమ్యాలన్నీ చెరిగిపోయిన సందర్భమిది. బాలీవుడ్ అంతా ఇప్పుడు సౌత్ వైపు మాత్రమే చూస్తుంది. అందులోనూ తెలుగు సినిమా అంటే మరింత అభిమానం చూపిస్తున్నారు. హైదరబాద్ హబ్ గా తమ హిందీ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఇంకా అవసరం అనుకుంటే టాలీవుడ్ హీరోల్ని సైతం రంగంలోకి దించేస్తున్నారు. అదీ చాలాకపోతే కాకాపట్టే కార్యక్రమాలు సైతం జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ ఎక్కడా ఏ కోసానా కనిపించేవి కాదు. కేవలం 'బాహుబలి'...'పుష్ప'..'ఆర్ ఆర్ ఆర్'..'కార్తికేయ2'..'కేజీఎఫ్' లాంటి చిత్రాలు హిందీ బెల్ట్ ని షేక్ చేసిన నాటి నుంచే మొదలైంది ఈ ట్రెండ్.
టాలీవుడ్ సెలబ్రిటీలతో తరుచూ బాలీవుడ్ సెలబ్రిటీలు మింగిల్ అవుతున్నారు. తెలుగు టీవీ ఛాన్సెల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ లో సైతం భాగమవుతున్నారంటే సన్నివేశం ఎలా ఉందో అద్దం పడుతుంది. కొన్ని రోజుల పాటు అమీర్ ఖాన్..రణబీర్ కపూర్..అలియాభట్ లాంటి నటులు నేరుగా హైదరాబాద్ లోనే తిష్ట వేసారు. వాళ్లకి తోడుగా చిరంజీవి..రాజమౌళి..నాగార్జున లాంటి స్టార్లు నిలబడ్డారు.
ఇలా బాలీవుడ్ -టాలీవుడ్ మధ్య రోజు రోజుకి బాండింగ్ బలపడుతుంది. తాజాగా రణవీర్ సింగ్ సైమా అవార్డుల వేడుకని టాలీవుడ్ రిలేషన్ కోసం సద్వినియోగపరుచుకున్నట్లు కనిపిస్తుంది. దక్షిణాది నటీనటులతో గడిపిన కొన్ని క్షణాల్ని..వాళ్లతో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని తన అభిమానం చాటుకున్నారు.
ముందుగా యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ తో దిగిన ఫోటోని షేర్ చేసారు. ఈ ఫోటోని ఉద్దేశించి 'ది ఐకాన్' అంటూ కామెంట్ చేసారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..రాకింగ్ స్టార్ యశ్ తో దిగిన ఫోటోల్ని సైతం షేర్ చేసి యశ్ ని 'భాయ్ 'అంటూ రాసుకొచ్చారు. అలాగే విజయ్ దేవరకొండ..పూజాహెగ్డే... రానా దగ్గుబాటిలతో కలిసి ఉన్న స్నాప్స్ ని షేర్ చేసిన బెస్ట్ మూవ్ మెంట్స్ గా రివీల్ చేసారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రణవీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. భారీగా అభిమాన గణం కలిగిన స్టార్. యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న నటుడు. అలాంటి నటుడి నిరాడంబరతకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే కాదు రణవీర్ ఎంతో జోవియల్ పర్సన్. విషయం ఏదైనా ఎంతో ఓపెన్ గా మాట్లాడుతారు. అంతే సరదాగా జోకులేస్తాడు. నవ్వుతాడు. ఇదంతా రణవీర్ గొప్పతనం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.