Begin typing your search above and press return to search.
టాప్ స్టోరీ: సెకండ్ లైఫ్ కేరాఫ్ వెబ్ సిరీస్
By: Tupaki Desk | 29 Aug 2019 1:30 AM GMTవెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలంతా కాలక్రమంలో క్రేజ్ తగ్గాక క్రమక్రమంగా సైడైసోవాల్సిందే. నవతరం స్టార్ల వెల్లువలో ఈ సీన్ తప్పదు. అయితే అలాంటి వారికి ఓ కొత్త అండ నేనున్నా అంటూ ఉపాధినివ్వడం హాట్ టాపిక్ గా మారింది. సిల్వర్ స్క్రీన్ పై ఫేడవుట్ అయిపోయిన తారలకు వెబ్ సిరీస్ లు వెల్ కం చెబుతూ సెకండ్ లైఫ్ నిస్తున్నాయి. బాలీవుడ్ లో ఓ దశలో యమ క్రేజ్ ని సొంతం చేసుకున్న తారలంతా ప్రస్తుతం క్రేజ్ తగ్గిపోవడంతో వెబ్ సిరీస్ ప్రపంచంలోకి ఎంటరవుతూ రెండు చేతులా సంపాదించేస్తున్నారు. సినిమాతో పోలిస్తే పారితోషికం- పని ఎక్కువే వుండటంతో చాలా మంది ఆవైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఏడుగురు స్టార్లు ఈ దారిలో యమబిజీగా మారిపోయారు.
బాలీవుడ్ లో సీరియల్ కిస్సక్ గా యమ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఇమ్రాన్ హష్మీ గత కొంత కాలంగా సినిమాలు లేక ఫేడవుట్ యాక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అతన్ని మళ్లీ బిజీ చేసింది వెబ్ సిరీస్. ఇమ్రాన్ హష్మీ నటించిన తాజా వెబ్ సిరీస్ `బర్డ్ బ్లడ్` త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ వెబ్ సిరీస్ బెలుచిస్థాన్ లో పేరుకుపోతున్న పాకిస్థాన్ టెర్రరిజమ్ నేపథ్యంలో సాగుతుంది. దీనిపై ఇమ్రాన్ హష్మీ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇక అర్జున్ రాంపాల్ కూడా వెబ్ సిరీస్ నే నమ్ముకున్నాడు. అతను నటించిన `ఫైనల్ కాల్` స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జీ5లో రిలీజ్ అవుతోంది.
ఇదే జీ 5లో కునాల్ కీమూ నటించిన `అభయ్` రాబోతోంది. అమ్మాయిల కిడ్నాప్- హత్యల నేపథ్యంలో మిర్డర్స్ మిస్టరీ నేపథ్యంలో రాబోతున్నా ఈ వెబ్ సిరీస్ త్వరలో జీ 5లో రాబోతోంది. ఇక హీరోగా ఓ వెలుగు వెలిగిన సైఫ్ అలీఖాన్ తన శకం ముగిసిపోవడంతో సాక్రడ్ గేమ్స్ తో వెబ్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ క్రేజ్ ని సొంతం చేసుకోవడంతో మరో భాగంలో ఇటీవలే నెట్టింట సందడి చేస్తున్నాడు సైఫ్. తెలుగులో `గూఢచారి` సినిమాతో పరిచయమైన శోభిత ధూళిపాల తరువాత అవకాశాలు తలుపుతట్టకపోవడంతో వెబ్ సిరీస్ నే నమ్ముకుంది. ఆమె నటించిన తాజా బెబ్ సిరీస్ `మేడ్ ఇన్ హెవెన్` త్వరలో నెట్టింట సందడి చేయబోతోంది. వీరితో పాటు దియా మీర్జా- జాక్వెలిప్ ఫెర్నాండెజ్- అక్షయ్ కుమార్ కూడా వెబ్ సిరీస్ బాటపడుతున్నారు. ఫామ్ కోల్పోక ముందే తెలివిగా.. కిలాడీ అక్షయ్ కుమార్-సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్లు వెబ్ సిరీస్ లకు వెల్ కం చెప్పడం అన్నది ఆసక్తికర పరిణామమేనని చెప్పొచ్చు.